అక్కినేని ఫ్యామిలీలో గొడవలున్నాయా..?

సాధారణంగా సెలెబ్రెటీల పుట్టినరోజు అంటే అభిమానుల నుండి సినీ ప్రముఖుల దాకా అందరూ బర్త్ డే విషెస్ చెప్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబెర్స్ విషెస్ చెప్తూ కేక్ కట్టింగ్స్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అవడంతో పరిస్థితి మారింది. సెలెబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమై తమ బర్త్ డే లను సింపుల్ గా ఇంట్లోనే జరుపుకుంటున్నారు. కొంతమంది పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకోవడం కూడా మానేశారు. అక్కినేని నటవారసుడు అఖిల్ కూడా కరోనా నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ యంగ్ హీరోకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. అఖిల్ కు మంచి భవిష్యత్ ఉండాలని భావిస్తున్నామని వారు తమ అభినందనలు వెల్లడించారు. కానీ అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఇతర సభ్యులు మాత్రం అఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పినట్లు ఎక్కడా కనిపించలేదు.బర్త్ డే అంటే సెలెబ్రేట్ చేసుకోక పోయినా సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టడం సాధారణంగా ఈ రోజుల్లో జరుగుతున్నదే. కానీ అన్నా వదినలు నాగ చైతన్య – సమంత – సుమంత్ లాంటి వారు కూడా ఈసారి అఖిల్ కు సోషల్ మీడియాలో విషెస్ చెప్పలేదు. ప్రతి ఏడాది తమ సోషల్ మీడియాలో అఖిల్ కు విష్ చేస్తూ వస్తోన్న వీరు ఈసారి చెప్పక పోవడంపై ఫ్యాన్స్ ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని కుటుంబంలో అంతా ఓకేనా అని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ లో ఏమైనా గొడవలు వచ్చాయా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరేమో సోషల్ మీడియాలో చెప్పకపోయినప్పటికీ.. ఫోన్ చేసి చెప్పి ఉండచ్చు కదా అన్న కామెంట్లు పెడుతున్నారు. మరి అఖిల్ కు వారు విషెస్ చెప్పారా..? కరోనా నేపథ్యం లో విషెస్ వద్దనుకున్నారా..? అక్కినేని కుటుంబం లో అంతా ఓకేనా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కాగా లాక్ డౌన్ నేపథ్యంలో నాగ చైతన్య – సమంత ఒక చోట ఉండగా.. అఖిల్ – నాగార్జున – అమల మరో చోట ఉన్నారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే సాదా సీదాగా పుట్టిన రోజును జరుపుకున్నారు అఖిల్. బర్త్ డే సందర్భం గా అఖిల్ తన తల్లిదండ్రులతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు.