Take a fresh look at your lifestyle.

అయోధ్యలో ఆవిష్కృతమైన చారిత్రాత్మక ఘట్టం…రామమందిరం నిర్మాణంకు శంకుస్థాపన చేసిన ప్రధాని | Ayodhya Bhoomi Puja live updates, PM Modi to lay foundation stone

0 15

[ad_1]

LIVE

National

oi-Kannaiah

|

అయోధ్య: ఇంకొన్ని గంటలు.. దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం నిర్మాణానికి బుధవారం తొలి ఇటుక పడబోతోంది. శతాబ్దాల తరబడి, చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయేలా అపురూప రామమందిరం మన కళ్ల ముందు సాక్షాత్కారం కానుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. రామమందిరం నిర్మాణాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు. ఇక అయోధ్య రామ మందిర భూమి పూజకు సంబంధించి మినిట్ టూ మినిట్ అప్ డేట్ మీకోసం

ఆలయ భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అయోధ్య సింగారించుకుంటోంది.. సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడుతోంది. భక్తిపూరక వాతావరణాన్ని అణువణువునా నింపుకొంటోంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఎటు చూసినా కాషాయ జెండాలు దర్శనం ఇస్తున్నాయి. జైశ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. సాధువులతో నగరం క్రమంగా నిండిపోతోంది. శ్రీరామచంద్రుడి భక్తులు ఒక్కొక్కరుగా అయోధ్యకు చేరుకుంటున్నారు. చాలామంది కాలి నడకన, చెప్పులు లేకుండా రావడం కనిపిస్తోంది. ఏ ఒక్కరిని పలకరించినా.. జైశ్రీరామ్ అంటూ సమాధానం ఇస్తున్నారు.

Ayodhya Bhoomi Puja live updates, PM Modi to lay foundation stone

Newest First Oldest First

అయోధ్యలో ముగిసిన రామమందిర నిర్మాణం భూమిపూజ

రామమందిర నిర్మాణంకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ..అయోధ్యలో ఆవిష్కృతమైన చారిత్రాత్మక ఘట్టం

కొనసాగుతోన్న భూమిపూజ కార్యక్రమం.. అయోధ్యలో మారుమోగుతున్న వేదమంత్రాలు

భూమిపూజలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ

రామమందిర నిర్మాణంకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

ప్రారంభమైన అద్భుతమైన ఘట్టం..వేదమంత్రాల మధ్య సాగుతున్న చారిత్రాత్మక వేడుక

రామజన్మభూమిలో పవిత్రమైన పారిజాత మొక్కను నాటిన ప్రధాని మోడీ

శ్రీరాముడి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ప్రధాని మోడీ

శ్రీరామచంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ

అయోధ్యలోని రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

హనుమాన్ గిర్హిలో కార్యక్రమం ముగించుకుని అక్కడి నుంచి రామజన్మభూమి వైపు వెళుతున్న ప్రధాని మోడీ

మోడీ ప్రధాని అయ్యాక తొలిసారిగా ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో వేదిక పంచుకోనున్నారు

ప్రధాని నరేంద్ర మోడీకి వెండికిరీటంతో గౌరవించిన హనుమాన్ గర్హి ప్రధాన అర్చకులు ప్రేమ్‌జీ దాస్

హనుమాన్ గర్హిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

హనుమాన్ గర్హికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయంలో కలయతిరిగిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన సీఎం యోగీ ఆదిత్యనాథ్

అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోడీ..

అయోధ్య

ఈ అపూర్వ ఘట్టం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.రామమందిర నిర్మాణంతో ప్రజల మధ్య వైషమ్యాలను తీసివేసి అందరిని కలుపుతుంది.అంతా వసుదైక కుటుంబకం అని చెబుతుంది: స్వామి చిదానంద సరస్వతి

గుజరాత్

గాంధీనగర్‌లో బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు రామమందిరం రూపంలో రంగోళి

మరి కొద్ది సేపట్లో అయోధ్యకు చేరుకోనున్న ప్రధాని మోడీ

అయోధ్యకు చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

హనుమార్ గర్హి వద్ద ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్

లక్నోకు చేరుకున్న ప్రధాని మోడీ..అయోధ్య వైపు వెళుతున్న మోడీ

రామజన్మభూమి ఎందరినో ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. ఈ భూమికి ఎంతో ప్రత్యేకత ఉంది: బీజేపీ నేత ఉమాభారతి

10:35 గంటలకు లక్నో చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ.ఉదయం 11:40 గంటలకు సాకేత్ యూనివర్శిటీకి హెలికాఫ్టర్ ద్వారా చేరుకోనున్న ప్రధాని మోడీ

భారతదేశం సువర్ణయుగంలోకి ప్రవేశించనుంది: బాబా రాందేవ్

గజియాబాద్

రామమందిర నిర్మాణం భూమి పూజ సందర్భంగా ఘజియాబాద్‌లో రామ భజన కీర్తనలు పాడుతున్న రామభక్తులు

అయోధ్య

రామజన్మభూమి స్థలంలో రామ్‌లల్లా విగ్రహం

ఢిల్లీ

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్యకు బయలుదేరి వెళ్లిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ అయోధ్యకు రావడం ఎంతో గర్వంగా ఉంది. వెండి కిరీటం,శిరస్త్రాణంలతో గౌరవిస్తాం.3.5 క్విటాళ్ల బరువున్న గంటను మోగించి ఆపై రామజన్మభూమికి వెళతారని ఆశిస్తున్నాను:హనుమాన్ గర్హి ప్రధాన అర్చకులు ప్రేమ్‌దాస్ జీ

READ MORE[ad_2]

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669