Take a fresh look at your lifestyle.

అయోధ్య రామాలయ రూపకర్తలు ఎవరో తెలుసా ? 15 తరాలుగా వారి ప్రస్థానం చాలా ఆసక్తికరం !! | designers of Ayodhya Ram mandir… The family’s history is so interesting!!

0 40

[ad_1]

ఆలయాల నమూనాలలో ఫేమస్ సోంపురా కుటుంబం

ఆలయాల నమూనాలలో ఫేమస్ సోంపురా కుటుంబం

77 ఏళ్ల చంద్రకాంత్ సోంపురా 30 సంవత్సరాల క్రితం అయోధ్యలోని రామ్ లల్లాకు ఆలయ పనులను ప్రారంభించారు. అప్పటి విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) అధ్యక్షుడు అశోక్ సింఘాల్‌తో కలిసి రామాలయ స్థలాన్ని సందర్శించారు. పారిశ్రామికవేత్త ఘనశ్యాం దాస్ బిర్లా రామ్ మందిర్ ప్రాజెక్టును చేపట్టిన సమయంలో సోంపురాను సింఘాల్‌కు పరిచయం చేశారు. సోంపురా అప్పటి బిర్లా దేవాలయాలలో పనిచేశారు. 1983లోనే సోంపురా రామమందిర ఆకృతికి రూపం ఇచ్చారు.

దేశ విదేశాల్లో ప్రసిద్ధ ఆలయాల రూపకర్తలుగా పేరు

దేశ విదేశాల్లో ప్రసిద్ధ ఆలయాల రూపకర్తలుగా పేరు

సోంపురా కుటుంబానికి ఆలయాల నిర్మాణాలలో 15 తరాల నుండి విశేష అనుభవం ఉంది . సోమనాథ్ నుండి అయోధ్య వరకు, ఆలయ నిర్మాణదారుల కుటుంబంగా ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది . చంద్రకాంత్ సోంపురా అతని కుటుంబం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా దాదాపు 200 దేవాలయాలను రూపొందించారంటే వారి ఖ్యాతి అర్ధం చేసుకోవచ్చు .

77 ఏళ్ల చంద్రకాంత్ సోంపురా అయోధ్య రామాలయ రూపకర్త

77 ఏళ్ల చంద్రకాంత్ సోంపురా అయోధ్య రామాలయ రూపకర్త

రామ మందిర నిర్మాణంపై 77 ఏళ్ల చంద్రకాంత్ సోంపురా తన వయస్సును దృష్టిలో పెట్టుకుని మరియు కరోనావైరస్ మహమ్మారి కారణంగా సైట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ రామ్ జన్మభూమి ఆలయం యొక్క సైట్ ప్లాన్ చేసిన అతని కుమారుడు ఆశిష్, 49, ఈ ఆలయాన్ని నిర్మించడానికి కాంట్రాక్ట్ పొందిన లార్సెన్ & టౌబ్రో అనే సంస్థతో కలిసి వివరాలను రూపొందించడానికి అయోధ్యలో ఉన్నారని పేర్కొన్నారు .

సోమనాథ్ ఆలయాన్ని రూపొందించింది ఈ కుటుంబమే

సోమనాథ్ ఆలయాన్ని రూపొందించింది ఈ కుటుంబమే

1951 లో భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన గుజరాత్ తీరంలో ప్రభాస్ పటాన్ లోని సోమనాథ్ ఆలయాన్ని నిర్మించిన అతని తండ్రి మరియు ముత్తాత ప్రభుశాంకర్ నుండి ఆలయ నిర్మాణ కళ తనకు ఎక్కువగా వచ్చిందని పేర్కొన్నారు . ప్రభుశాంకర్ పద్మశ్రీతో గౌరవించబడ్డారని పేర్కొన్నారు. బద్రినాథ్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్ట్ చేసింది కూడా వీరి కుటుంబీకులే .

15 తరాలుగా అద్భుతమైన నైపుణ్యంతో ఆలయాల నిర్మాణం

15 తరాలుగా అద్భుతమైన నైపుణ్యంతో ఆలయాల నిర్మాణం

వన్నె తరగని చరిత్ర ఉన్న ప్రముఖ ఆర్కిటెక్ట్ సోంపురా కుటుంబం దేశంలోని ఎన్నో ప్రసిద్ధ ఆలయాలకు ఆకృతులను అందించిన కుటుంబం. సోమనాథ్ .. అక్షరధామ్ నేడు అయోధ్య రామాలయానికి నమూనా అందించి ఆలయ నిర్మాణాలలో తమకున్న పట్టును స్పష్టం చేసుకున్నారు. రామమందిర ఆకృతిని ఇచ్చిన సోంపురా కుటుంబం తమ జీవితం ధన్యం అయినట్లుగా భావిస్తున్నారు. హిందువుల దశాబ్దాల కల నెరవేర్చడంలో వారు కీలక భూమిక పోషిస్తున్నారు. 15 తరాలుగా ఈ కుటుంబీకులు అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు.

రామాలయ అద్భుత సృష్టి చేస్తున్న కుటుంబ ప్రస్థానం ఆసక్తికరం

రామాలయ అద్భుత సృష్టి చేస్తున్న కుటుంబ ప్రస్థానం ఆసక్తికరం

భావ్‌నగర్‌లోని పాలితానా పట్టణం నుండి వచ్చిన సోంపురులు తమను తాము ‘చంద్రుని నివాసితులుగా వారిని వారు భావిస్తారు. వారి పూర్వీకులు రామ్‌జీ పాలితానాలోని శేట్రుంజయ్ కొండలపై జైన దేవాలయ సముదాయాన్ని నిర్మించాడు. ఇక వీరి కుటుంబం ఎన్నో అద్భుతమైన ఆలయాలు నిర్మించారు . వారి అద్భుతమైన నిర్మాణాలలో లండన్లోని స్వామినారాయణ్ ఆలయం కూడా ఒకటి. తరతరాలుగా ఆలయాల ఆకృతుల సృష్టికర్తలుగా పేరుగాంచిన ఈ కుటుంబమే రామాలయ అద్భుత సృష్టికి పని చెయ్యటం విశేషం .

[ad_2]

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669