కరోనాతో చనిపోతే అంత్యక్రియలు ఇలా చేయాలి… 5 అంశాలు..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనాతో చనిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, కరోనాతో చనిపోయిన వారిని ఎలా అంత్యక్రియలు నిర్వహించాలనే అంశంపై చాలా వరకు క్లారిటీ లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. చనిపోయిన వారిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారు కూడా ఉండే అవకాశం ఉంది. అందులో ఒక్కో మత ఆచారం ప్రకారం అంత్యక్రియలు ఒక్కోలా ఉంటాయి. హిందువులు మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ముస్లింలు ఖననం చేస్తారు. క్రైస్తవులు కూడా మృతదేహాలను ఖననం చేస్తారు. దీంతో ఈ మూడు మతాచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు ఎలా నిర్వహించాలనేదానిపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

    • కరోనాతో మరణిస్తే ఆసుపత్రి వాహనాల్లో ప్రభుత్వం నియమించిన వ్యక్తులతో మృతదేహాలను ప్యాకింగ్ చేస్తారు. శ్మశానవాటికకు తరలిస్తారు.
  • కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే ఖననం వేళ అనుమతి ఉంటుంది.
  • మృతదేహాల ఖననాన్ని వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహిస్తుంది.
  • కరోనా మృతుల్లో హిందువులు ఉంటే, వారి మృతదేహాలను దహనం చేస్తారు.