Take a fresh look at your lifestyle.

కాక రేపుతున్న సవాళ్లు… 48గంటల డెడ్ లైన్… వైసీపీ-టీడీపీ హోరాహోరీ రాజకీయం… | minister botsa satyanarayana challenges chandrababu naidu to resign and given 48 hours deadline

0 30

[ad_1]

చంద్రబాబుకు బొత్స సవాల్...

చంద్రబాబుకు బొత్స సవాల్…

మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు నమ్మకం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను తక్షణం రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్‌ విసిరారు. ప్రజాక్షేత్రంలో నిలబడితే ప్రజలు ఎవరివైపు ఉన్నారో తేలిపోతుందన్నారు. మూడు రాజధానులపై చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆయనకు పూర్తిగా మతిస్థిమితం లేదని రూఢీ అవుతోందని విమర్శించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి,తాడికొండ నియోజకవర్గాల్లో ప్రజలిచ్చిన తీర్పు చంద్రబాబు ‘రాజధాని డిజైన్’కు చెంప పెట్టు కాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు 48గం. డెడ్ లైన్...

చంద్రబాబుకు 48గం. డెడ్ లైన్…

తాను విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నారో లేదు 48 గంటల్లోగా బదులివ్వాలని బొత్స డిమాండ్‌ చేశారు.అభివృద్ది వికేంద్రీకరణను వ్యతిరేకిస్తే చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ ఉండదన్నారు. తాను పుట్టి,పెరిగిన రాయలసీమలో జ్యుడీషియల్ కేపిటల్‌ ఏర్పాటును సైతం చంద్రబాబు వ్యతిరేకించి సొంత మామకే కాదు సొంత గడ్డకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలు,కుయుక్తులు సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.

జగన్‌ 48గంటల్లోగా స్పందించాలి : యనమల

జగన్‌ 48గంటల్లోగా స్పందించాలి : యనమల

అటు మంత్రి బొత్స చంద్రబాబును సవాల్ చేయగా… ఇటు మాజీ మంత్రి యనమల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు చేసిన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఇందుకోసం 48 గంటల సమయం ఇస్తున్నానని… ఈలోగా ఆయన స్పందించకపోతే మళ్లీ మాట్లాడుతానని చెప్పారు.జగన్ రాజకీయాల వల్ల 13 జిల్లాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఇది కచ్చితంగా తుగ్లక్ పాలనే అని… రాష్ట్రాన్ని పాడుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

[ad_2]

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669