Take a fresh look at your lifestyle.

జీతాలివ్వలేని జగన్ రాజధాని మారుస్తారా? – సోము వీర్రాజు 13 అనడం కరెక్టేనా? – ఎంపీ రఘురామ ఫైర్ | ap three capitals: ysrcp mp raghurama slams cm jagan and bjp chief somu veerraju over capital

0 31

[ad_1]

రెఫరెండంకు వెళ్లాలి..

రెఫరెండంకు వెళ్లాలి..

రాజధాని ఏర్పాటుతో కేంద్రానికి సంబంధం లేదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిర్ణయమేనని చెప్పడం టెక్నికల్ గా కరెక్టే అయినా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానుల్ని మార్చుకుంటూ పోవడం మంచి సంస్కృతి కాబోదని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. రాజధాని వస్తుందన్న ఆశతో ఎంతో మంది మధ్య తరగతి ఉద్యోగులు, ప్రజలు అమరావతిలో భూములు కొన్నారని, రాజధాని మార్పుతో ఇప్పుడు వారాంతా అన్యాయానికి గురవుతారని గుర్తుచేశారు. ఇప్పటివరకు అమరావతిపై ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేశాయో చెప్పాలని హైకోర్టు ఆదేశించడం శుభపరిణామమని, అమరావతి రైతులకు న్యాయం చేయాలంటే రూ. 80 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. రాజధాని విషయంలో సీఎం జగన్ రెఫరెండంకు వెళ్లాలని రఘురామ డిమాండ్ చేశారు.

కిమ్ దేశం కకావికలం: ఐదేండ్ల తర్వాత అక్కడికి నియంత నేత – పొరుగున సౌత్, చైనాలోనూ ఆగమాగం

సోముపై మాట్లాడటం బాధాకరం..

సోముపై మాట్లాడటం బాధాకరం..

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త సారధిగా నియమితులైన సోము వీర్రాజు.. తమ మిత్రుడు జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ తర్వాత చేసిన కామెంట్లు వెటకారంగా చూడాలో, సీరియస్ గా చూడాలో అర్థంకావడంలేదని వైసీపీ ఎంపీ అన్నారు. ‘‘టీడీపీలా తాము ఒక్కరాజధానికో, వైసీపీలా మూడు రాజధానులో కాకుండా.. 2024లో బీజేపీ- జనసేన అధికారంలోకి వస్తే ఏపీలో 13 రాజధానులు ఏర్పాటు చేసి అన్ని జిల్లాలకూ న్యాయం చేస్తానని వీర్రాజు అన్నట్లు తెలిసింది. ఆయన మాటలపై నేను స్పందించాల్సిరావడం బాధాకరం. అలాగైతే బీజేపీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పని చేస్తారా? ఆ లెక్కన ఉత్తర ప్రదేశ్ లో ఎన్ని రాజధానులు ఏర్పాటు కావాలి? ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలా మాట్లాడటం సమంజసమేనా?”అని రఘురామ నిలదీశారు.

వేట కుక్కలై వెంటాడుతారు..

వేట కుక్కలై వెంటాడుతారు..

ఏపీలో మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయంటూ గెజిట్ నోట్ విడుదలైన తర్వాత అమరావతి ప్రాంతంలో మళ్లీ ఆందోళనలు చెలరేగడం, పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్లపై నిరసనలు చేపట్టడం తెలిపిందే. కాగా, అమరావతి మహిళలను ఉద్దేశించి అధికార వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు వెలువడుతున్నాయని ఎంపీ రఘురామ చెప్పారు. మహిళల్ని కుక్కలతో పోల్చుతూ కొందరు దారుణమైన కామెంట్లు పెడుతున్నారని, అదే మహిళా రైతులంతా వేట కుక్కలై వేటాడే పరిస్థితి దగ్గరపడిందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని ఎంపీ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు భరోసా కల్పించేందుకు త్వరలోనే తాను మనోధైర్యయాత్ర చేపడతానన్న మాటకు కట్టుబడి ఉన్నానని రఘురామ ఉద్ఘాటించారు.

అదే నిజమైతే జగన్‌కు చెడ్డపేరు..

అదే నిజమైతే జగన్‌కు చెడ్డపేరు..

ప్రముఖ తెలుగు దిన పత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఓ కథనం తనను తీవ్రంగా బాధించిందని, ఆలోచింపజేసిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. బాధ్యతగల ఓ మాజీ న్యాయాధికారి సంభాషణగా పత్రికలో వచ్చిన కథనం నిజమైతే.. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుందని, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా, న్యాయవ్యవస్థలపై గౌరవం పెరిగేలా వ్యవహరించుకోవాలని ఎంపీ సూచించారు. దూరదృష్టి లేనందువల్లే ఇలాంటి ఘటనలను జరుగుతున్నాయని, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కు బెదిరింపుల వ్యవహారం కూడా ఇలాంటిదేనని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బెదిరింపులకు పాల్పడటం కరెక్టుకాదని రఘురామ ఆక్షేపించారు.

[ad_2]

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669