జూడాలతో మంత్రి ఈటల.. చర్చలు సఫలం

  • ఆం‌దోళన విరమించిన డాక్టర్లు 
  • వైద్యులపై దాడి చేస్తే చాలా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : పోలీసుల హెచ్చరిక

వైద్యులపై దాడి చేస్తే చాలా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : పోలీసుల హెచ్చరిక
తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో బుధవారం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూనియర్‌ ‌డాక్టర్లు  ప్రకటించారు. జూడాల డిమాండ్లపై మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారు. ఆందోళన విరమించిన జూడాలు విధుల్లో చేరుతున్నారు. ప్రధానంగా ఐదు డిమాండ్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. డాక్టర్లతో మంత్రి ఈటల సమావేశం అయ్యారు. గాంధీ హాస్పిటల్‌లో డాక్టర్‌ ‌పై దాడిని ఖండిస్తూ జూనియర్‌ ‌డాక్టర్ల ఆందోళన కొనసాగుతున్న వేళ వారితో మంత్రిఈటెల రాజేందర్‌ ‌నేరుగా చర్చలకు దిగారు. వారికి అండగా ప్రభుత్వం ఉందని హావ్ని ఇచ్చారు. ఉదయం నుంచి హాస్పిటల్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జూనియర్‌ ‌డాక్టర్లను ఆందోళన విరమించాలని మంత్రి ఈటల రాజేందర్‌ ‌విజ్ఞప్తి చేశారు.

మాట్లాడేందుకు ప్రతినిధి బృందం సెక్రటేరియట్‌కు రావాలని కోరారు. కానీ మంత్రి విజ్ఞప్తిపై స్పంది ంచలేదు.  తాము సీఎంనే కలుస్తామని తెగేసి చెప్పారు. మంత్రితో చర్చించేందుకు సెక్రటేరియట్‌ ‌కు వెళ్లలేదు. దీంతో స్వయంగా మంత్రి ఈటలగాంధీ మెడికల్‌ ‌కాలేజ్‌ ‌కు వెళ్లారు. సెమినార్‌ ‌హాల్‌ ‌లో జూనియర్‌ ‌డాక్టర్లతో సమావేశమయ్యారు. డిసెంబర్‌లో కేంద్రం తీసుకువచ్చిన జీఓను పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేసారు. గాంధీలోనే కోవిడ్‌ ‌ట్రీట్మెంట్‌ ‌కాకుండా.. ఇతర హాస్పిటల్స్ ‌లో కూడా పేషెంట్లను ఉంచాలన్నారు. త్వరలో జరగబోతున్న పీజీ ఎగ్జామ్స్  ‌ను వాయిదా వేయాలని డిమాండ్‌ ‌చేసారు. దాడులు జరిగినప్పుడల్లా చర్చలు చేస్తున్నా.. ప్రయెజనం ఉండటంలేదని.. అందుకే నేరుగా సీఎంతోనే మాట్లాడతామని జూనియర్‌ ‌డాక్టర్లు. చెబుతున్నారు. మొత్తంగా ఈటెల రాజేందర్‌ ‌చర్చలతో వారు సానుకూలంగా స్పందించారు.చర్చలకు ముందు బుధవారం ఉదయం నుంచి జూనియర్‌ ‌డాక్టర్లు సమ్మెకు దిగారు.హైదరాబాద్‌ ‌గాంధీ దవాఖానా లో    మరణించిన   రోగి బంధువు దాడి  చేయడంతో    150 మంది జూనియర్‌ ‌డాక్టర్లు    మంగళవారం రాత్రి నుంచి ఆందోళన సాగిస్తున్నారు.   వారిని శాంతింప చేయడానికి తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌  ‌వచ్చారు. ఆయన ముందు వారు ఐదు డిమాండ్లను ఉంచారు ఆస్పత్రి  గేటును తోసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించిన జూనియర్‌ ‌డాక్టర్లను పోలీసులు తోసి వేశారు.  తోపులాట దృశ్యాలు మీడియాలో ప్రధానంగా ప్రసారం అయ్యాయి. కరోనా కేసులకు గాంధీ ఆస్పత్రి నోడల్‌ ‌కేంద్రంగా ఉంది. తాము పని చేయడానికే వచ్చామనీ,  దెబ్బలు  తినడానికి  రాలేదనీ, మమ్మల్ని కొడితే  పనులు  మానుకుని పోతామని జూనియర్‌ ‌డాక్టర్లు నినాదాలు చేశారు..  గాంధీ ఆస్పత్రిలో  2,150 కరోనా రోగులకు  వైద్య సేవలు అందిస్తున్నారు.  కాగా, జూనియర్‌ ‌డాక్టర్లు లేకపోవడంతోమంగళవారం వారం సాయంత్రం నుంచి నర్సులు పదివార్డుల్లో కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

మంత్రి ఈటల రాజేందర్‌ ‌ముందు జూనియర్‌ ‌డాక్టర్లు ఉంచిన డిమాండ్లు ఇవి…
1. కేంద్రం సూచించిన మేరకు ఆస్పత్రుల వద్ద పారామిలటరీ దళాలను నియోగించాలి.
2. రాష్ట్రంలో కోవిడ్‌ ‌కేసులు ఎక్కడ ప్రభుత్వం దృష్టికి వచ్చినా గాంధీ ఆస్పత్రికే వారిని తరలిస్తున్నారు. అలా
కాకుండా వివిధ ఆస్పత్రులకు తరలించాలి. దాని వల్ల గాంధీ ఆస్పత్రిపై  భారం తగ్గుతుంది.
3.గాంధీ ఆస్పత్రికి పంపుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలి.
4.కొత్త వైద్యుల నియామకం చేపట్టాలి.
– ప్రస్తుతం పని చేస్తున్న జూనియర్‌ ‌డాక్టర్లలో పీజీ పూర్తి   చేస్తున్న వారిని సీనియర్‌ ‌రెసిడెంట్స్ ‌గా తీసుకోవాలి,.
5. గతంలో జూనియర్‌ ‌డాక్టర్లపై దాడి చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. భవిష్యత్‌ ‌లో ఎలాంటి
చర్యలు తీసుకోనున్నారు.
6. తగినన్ని పీపీఈలు,ఎన్‌ 95 ‌మాస్క్ ‌లు సరఫరా చేయాలి.
సలహా కమిటీలో తెలంగాణ జూనియర్‌ ‌డాక్టర్‌ ‌ల అసోసియేషన్‌ ‌ప్రతినిధిని నామినేట్‌ ‌చేయాలి.
ఇద్దరి అరెస్టుః   మంగళవారం జూనియర్‌ ‌డాక్టర్లపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను  పోలీసులు అరెస్టు చేశారు.
40 రోజుల నుంచి నిర్విరామంగా పని చేస్తున్నాః
ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌ ‌లో  పీజీ రెసిడెంట్‌ ‌డాక్టర్‌ ‌గా పని చేస్తున్న డాక్టర్‌ ‌రీతేష్‌  ‌గడిచిన  40 రోజుల నుంచి నిర్వి రామంగా పని చేస్తున్నామని తమ సేవలకు గుర్తింపు లేకపోగా, దాడులు చేస్తున్నారని అన్నారు.  250 పడకలకు  పీజీ డాక్టర్‌ ఒక్కరే ఉన్నారని అన్నారు. కిరణ్‌ అనే మరో వైద్యుడు మాట్లాడుతూ, అన్ని కేసులూ  ఒకే చోటుకు పంపడం మంచిది కాదనీ, మిగిలిన ఆస్పత్రులకు కూడా పంపాలని అన్నారు. కేవ లం కరోనా కేసులు మాత్రమే చూడటం వల్ల తమ  సబ్జెక్టస్ ‌పై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నామని  మరో వైద్యుడు అన్నారు.