తెలంగాణలోనూ తప్పనిసరి.. మాస్క్‌లు ధరించకుంటే కఠిన చర్యలు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రోజుకు కొత్తగా వందల సంఖ్యలో బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కట్టదిట్టం చేస్తూనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని స్పష్టం చేసిది. కరోనా సోకిన వారిలో చాలా మందిలో వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడం లేదని… ఈ క్రమంలో వారి వల్ల ఇతరులకు వ్యాపించే అవకావం ఉన్నందన మాస్క్‌లను తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.