బ్రేకింగ్…ఆర్ఆర్ఆర్ సమ్మర్ కేనా?

మోస్ట్ హ్యాపినింగ్ మూవీ అనుకుంటున్న రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్ విడుదల మరోసారి వాయిదా పడక తప్పదా? ఇప్పటికే 2020 సమ్మర్ నుంచి 2021 సంక్రాంతికి వాయిదా పడిన ఆ సినిమా మరోసారి మరో మూడు నెలలు వెనక్కు జరిగి 2021 సమ్మర్ కు వెళ్తుందని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. దీనికి అనేక లాజికల్ కారణాలు వినిపిస్తున్నాయి.

అన్నింటికన్నా కీలకమైనది సినిమాలో ముగ్గురు యూరోపియన్ నటలు వుండడం. ఇప్పట్లో ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అన్నది ప్రభుత్వం అనుమతించేలా లేదు. ఎలా లేదన్నా జూన్ వస్తే తప్ప ఈ విషయం గురించి ఆలోచించకపోవచ్చు. 

రెండవది ఈ సినిమాకు పనిచేసే గ్రాఫిక్ కంపెనీలు కూడా ఇప్పడు వర్క్ చేసే పరిస్థితిలో లేవు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది డేటా కంపెనీలకు నడుస్తుంది తప్ప, గ్రాఫిక్స్ కంపెనీలకు కాదు. మామూలు ల్యాప్ టాప్ ల మీద జరిగిపోయే పని కాదు. బలమైన సిస్టమ్ లు అవసరం.

ఆర్ఆర్ఆర్ షెడ్యూలు ప్రకారం జూన్ వేళకు సినిమాలో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ లు పూర్తి కావాల్సి వుంది. ఇవి చాలా మేజర్ ఎపిసోడ్ లు. కానీ షూటింగ్ లు జూన్ నుంచి ప్రారంభం అవుతాయా? అన్నది ఇప్పటికీ అనుమానంగా వుంది.

వాస్తవానికి ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికి జరగడం వల్ల, షూటింగ్ టైమ్ కు చాలా వెసులుబాటు వచ్చింది.అది ఎంత వెసులు బాటు అంటే దాదాపు మూడు నెలలు. అంటే అక్టోబర్ నాటికే ఆర్ఆర్ఆర్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని ధీమాగా వున్నారు. కానీ ఇప్పుడు ఆ మూడు నెలలు కరోనా ఎత్తుకుపోతోంది.

అయినా సరిపోతుంది అని సరిపెట్టుకుందామన్నా, ఈ బ్రిటిష్ యాక్టర్లు, విదేశాల్లో గ్రాఫిక్ పనులు, అలాగే విదేశీ టెక్నీషియన్లు రావాల్సివుండడం వంటివి అడ్డం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఇక ఆర్ఆర్ఆర్ 2021 సమ్మర్ కే అన్న టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది.