సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌కు సీరియస్

సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌కు సీరియస్‌గా ఉన్నట్లుగా సమాచారం. ఈరోజు (గురువారం) ఆయన తన ఇంట్లో నాలుగు గంటల సమయంలో సడెన్‌గా పడిపోవడంతో, తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేర్చారని ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఆయనకు చికిత్స అందుతుందని, పరిస్థితి కొంచెం సీరియస్‌గానే ఉందని, ఆయనకు చికిత్స అందించిన డాక్టర్స్ తెలిపినట్లుగా సమాచారం. కమెడియన్‌గా, విలన్‌గా అనేక పాత్రలలో నటించిన నర్సింగ్ యాదవ్.. రామ్ గోపాల్ వర్మ చిత్రాలలో రెగ్యులర్‌గా ఉండే నటులలో ఒకరు. అనేక భాషల్లో ఆయన నటించారు.