అనుష్క అక్కడ కూడా అడుగుపెట్టేసింది...!
అనుష్క అక్కడ కూడా అడుగుపెట్టేసింది...!

దక్షిణాది అగ్ర కథానాయకిగా వెలుగొందుతోంది అనుష్క శెట్టి. ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన అనుష్క.. ‘అరుంధతి’ ‘భాగమతి’ ‘బాహుబలి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో అదే స్థాయిలో భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకుంది. అయితే హీరోయిన్స్ అందరూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎప్పుడూ హడావిడి చేస్తుంటే.. అనుష్క మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అయినప్పటికీ అనుష్క కి ఫేస్ బుక్ లో 23 మిలియన్స్.. ఇన్స్టాగ్రామ్ లో 3.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో అనుష్క రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫేస్ బుక్ లో అత్యధిక లైక్స్(14 మిలియన్) కలిగిన సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీగా స్వీటీ నిలిచింది. అయితే ట్విట్టర్ కి మాత్రం దూరంగా వుంటూ వచ్చింది.

ఇటీవల ట్విటర్ లోకి ఎప్పుడు వస్తారని స్వీటీని ప్రశ్నిస్తే.. నాకు సిగ్గు ఎక్కువ అందుకే దూరంగా ఉన్నానని సమాధానం చెప్పింది. ఏదైనా చెప్పాలని నా మనసుకు అనిపించినప్పుడు ట్విటర్ లోకి కచ్చితంగా వస్తా.. అప్పటి నుంచి అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటా అని చెప్పుకొచ్చింది. చెప్పినట్లుగానే అనుష్క తాజాగా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. ”హాయ్.. మీరు అందరూ బాగున్నారని సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మీరందరూ నా అధికారిక ట్విట్టర్ ఖాతాను అనుసరించండి” అని ఫస్ట్ ట్వీట్ చేసింది. దీనికి పెద్ద ఎత్తున అనుష్క అభిమానులు ఆమెకు వెల్కమ్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే సుమారు 1 మిలియన్ మంది అనుష్కను ఫాలో అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే స్వీటీ ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here