ఆర్థిక వ్యవస్థ కుదురుకోలేదు.. బాంబు పేల్చిన నిర్మల
ఆర్థిక వ్యవస్థ కుదురుకోలేదు.. బాంబు పేల్చిన నిర్మల

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి.  భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ అయితే మైనస్ 30లలోకి జారిపోయింది. ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనన్న భావన నెలకొంది.
అయితే ఇప్పుడు అన్ లాక్ తో కుదుటపడుతున్నా కరోనా కారణంగా నిలిచిపోయిన వ్యవస్థలు కార్యకలాపాలు ఇంకా మునుపటి వేగం అందుకోలేదని అర్థమవుతోంది. దీంతో మరికొన్నాళ్లు ఆర్థిక ఇబ్బందులు తప్పవని కేంద్రం సంకేతాలు ఇస్తోంది.
తాజాగా ఓ బిజినెస్ పత్రికతో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాంబు పేల్చారు. కేంద్రం సంస్కరణలు చేపడుతోందని.. దీనిపై విమర్శలు వస్తున్నా దీర్ఘకాలంగా వాటి ఆవశ్యకత ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.
కరోనా వైరస్ ప్రభావంతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండో క్వార్టర్ లోనూ కుదురుకోలేదు. ప్రధాన నగరాల్లో వ్యాపార – వాణిజ్య సముదాయాలు – ఆఫీసుల కార్యకలాపాలు మునుపటి స్థాయికి చేరుకోలేకపోవడం.. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తుండడం.. పరిశ్రమలు కూడా ఉత్పత్తి సాధారణ స్థితిలో చేయలేకపోవడంతో వరుసగా రెండో క్వార్టర్ లో కూడా నిరాశజనకంగానే భారత ఆర్థిక వ్యవస్థ కనపడుతోంది.
 దీంతో కేంద్ర మంత్రి నిర్మలా తాజాగా భారత ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే కోలుకుంటోందని.. తిరిగి సాధారణ స్థాయికి ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదని స్పష్టం చేశారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here