ఉపాసన గిల్టీ పీలయ్యేలా సామ్ ఏం చేసిందట!
ఉపాసన గిల్టీ పీలయ్యేలా సామ్ ఏం చేసిందట!

ఇటీవల సామ్ – ఉపాసన జోడీ వీడియో చిట్ చాట్ లతో ఎన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తాజాగా ప్లాంట్ ఫుడ్ (మొక్కల ఆధారిత ఆహారం) పై సమంత ఆసక్తికర కథనం రాసారు. అలాగే తాను మొక్కల పెంపకం దానిని నుంచి ఆహారం తయారు చేసుకోవడం అనే టాపిక్ ని సమంత వివరించారు. అలాగే కొన్ని క్యారెట్ మొక్కల్ని చేతపట్టి సామ్ ఇచ్చిన ఫోజు తాజాగా మరోసారి వైరల్ అవుతోంది. .

సమంత రూత్ ప్రభు కి తరచుగా తన కిచెన్ గార్డెన్ నుండి పోస్టులను పంచుకోవడం ఓ అలవాటు. గత నెలలో ఆమె స్వదేశీ క్యారెట్ల సమూహంతో ఒక చిత్రాన్ని పంచుకుంది. దానికి తన క్యాప్షన్ లో ఇలా రాసింది. “ఈ వారం మెనూ … క్యారెట్ జ్యూస్- క్యారెట్ పచ్చడి- క్యారెట్ హల్వా- క్యారెట్ ఫ్రై- క్యారెట్ పకోడి- క్యారెట్ ఇడ్లీ .. క్యారెట్ ఐటెమ్స్ “ అంటూ రాసుకొచ్చింది.

#GrowWithMe సిరీస్ లో భాగంగా.. తన కిచెన్ గార్డెన్ నుండి మరొక పోస్ట్ను పంచుకుందిజ“ప్రతిచోటా జీవులన్నిటినీ సంతోషంగా స్వేచ్ఛగా ఉండనివ్వండి. నా స్వంత జీవితంలోని ఆలోచనలు మాటలు చర్యలు ఆ ఆనందానికి ఏదో ఒక విధంగా సాయమవుతాయి. అందరికీ ఆ స్వేచ్ఛ ముఖ్యం“ అని వ్యాఖ్యను జోడించింది.

ఇక సమంత రాస్తున్న వ్యాసాల్ని చదువుతున్నప్పటి ఫోటోని ఉపసనా కొణిదెల బుధవారం తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పంచుకున్నారు. వెల్ నెస్ ప్లాట్ ఫామ్ యుఆర్. లైఫ్ కోసం సమంతా రూత్ ప్రభు రాసిన కథనం అది. ఈ వ్యాసం మొక్కల ఆధారిత ఆహారం అంశాలపై దృష్టి పెట్టిన రచన. ఉపాసన దానిపై ఏమన్నారంటే.. “రియాలిటీ! అది నా వెబ్ కోసం సామ్ రాసిన కథనాలను చదువుతున్నాను. ఇది ఒకరకమైన నరకంలా భావిస్తున్నాను. నా విషయంలో ఆరోగ్యకరమైన జీవన విధానం ఒక జర్నీలాంటిది. ఇది రాత్రికి రాత్రే సాధ్యం కాదు. సమంత రూత్ ప్రభు.. మొక్కల ఆధారిత ఆహారం ఎంతో స్ఫూర్తినిస్తోంది. ఏదో ఒక రోజు ఆ స్థాయికి చేరుకుంటాను“ అని ఉపాసన అన్నారు. అయితే దానికి సమంత రిప్లయ్ ఇస్తూ.. “మీరు చాలా అందంగా ఉన్నారు“ అన్న శీర్షికను ఇవ్వడం ఆసక్తికరం. ఒక రకంగా సమంతలా ప్లాంట్ డైట్ వంటి ఇన్నోవేషన్ ని తాను అనుసరించలేకపోవడాన్ని ఉపాసన గిల్టీ ఫీలవుతున్నారు మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here