కండువా కప్పడం తప్ప...
కండువా కప్పడం తప్ప...

ఆ పార్టీలోంచి ఈపార్టీలోకి వచ్చిన వారికి కండువా కప్పి ఆహ్వానించడం అన్నది ఓ ఆనవాయతీగా మారింది. ఓ విధంగా అదే పార్టీ అపాయింట్ మెంట్ లెటర్ అన్నమాట. చేరిన వారి స్థాయిని బట్టి ఎమ్మెల్యే నా, ఎంపీనా, మంత్రినా,సిఎమ్ నా,ఎవరు కండువా కప్పుతారు అన్నది పాయింట్. అయితే ఈ విషయంలో వైకాపా అధినేత సిఎమ్ జగన్ ఓ కొత్త నియమం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియమం పెట్టుకోవడానికి కూడా ఓ రీజన్ ఓ లాజిక్ వుందని తెలుస్తోంది.

విషయం ఏమిటంటే అధికారంలో ఏ పార్టీ వుంటే అటు జంప్ చేయడం అన్నది ప్రజా ప్రతినిధులకు అలవాటు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వుండకా వైకాపా ఎమ్మెల్యేలు ఇలాగే చాలా మంది జంప్ అన్నారు. దానికి ఎవరి రీజన్లు వారికి వున్నాయి. దీనిపై జగన్ ఎంత మొత్తుకున్నా, గోల చేసినా, అప్పట్లో స్పీకర్ గా వున్న కోడెల పట్టించుకోలేదు. అయిదేళ్లు అలాగే గడిచిపోయాయి.

ఇప్పుడు వైకాపా అధికారంలో వుంది. తేదేపా ఎమ్మెల్యేలు వైకాపా వేపు జంప్ అంటున్నారు. కానీ దీనికి జగన్ రెండు షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. పదవికి రాజీనామా చేసి రావాలి అన్నది ఒకటి. దీనికి ఏ ప్రజా ప్రతినిధి సిద్దంగా లేరు. వుండరు కూడా. అందుకే రెండో షరతు ఏమిటంటే వారు నేరుగా కాకుండా వారి కుటుంబసభ్యులను పార్టీలో చేర్పించడం ద్వారా ఇటు రావడం. కానీ అలా వచ్చిన ఎమ్మెల్యేలకు మాత్రం పార్టీ కండువా కప్పరంట. వారి కుటుంబ సభ్యులకు కప్పుతారు తప్ప వారికి కప్పరంట.

అందుకే ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలోకి రావాలాంటే  వారి పిల్లలనో, అన్నదమ్ములనో చేర్చాలన్నమాట. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. రాయలసీమకు చెందిన ఓ ప్రామినెంట్ ప్రజా ప్రతినిధి తేదేపా నుంచి వైకాపాలోకి వస్తాను అంటున్నారట. కానీ ఆయన కండిషన్ తనకు జగన్ కండువా కప్పాలన్నది. దాని వల్ల పర్యవసనాలు తరువాత చూసుకుందాం. కానీ తనకు జగన్ కండువా కప్పాల్సిందే అంటున్నారట.

దానికి మాత్రం జగన్ వచ్చినా, రాకపోయినా ఫరవాలేదు కానీ రాజీనామా చేయకుండా వస్తే కండువా కప్పే ప్రసక్తిలేదు అని చెప్పేసారట. అదీ విషయం. జగన్ మొండివాళ్ల కే మొండివాడు కదా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here