`గ్యాంగ్ లీడర్` బ్యూటీ ఇంతకీ ఏమైనట్టు?
`గ్యాంగ్ లీడర్` బ్యూటీ ఇంతకీ ఏమైనట్టు?

మల్లూవుడ్ నుంచి టాలీవుడ్ కి ప్రతిభ ప్రవహిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మాలయాళీ కథానాయికల హవాను ఇప్పట్లో ఎవరూ ఆపలేని సన్నివేశం ఉంది. కీర్తి సురేష్- అనుపమ పరమేశ్వరన్- నివేద థామస్ ఇలా భామలంతా మాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ ని ఏల్తున్న వారే. కెరీర్ నెమ్మదిగా ఉన్నా లాంగ్ స్టాండింగ్ లో నిలబడిన నాయికలుగా వీరంతా పాపులరవుతున్నారు.

అయితే అందరికీ అలాంటి అవకాశం ఉంటుందా? అంటే చెప్పలేం. కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయే భామలు ఉన్నారు. ఇక ఉన్నట్టుండి నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో ఓ వేవ్ లా వచ్చి వెళ్లింది ప్రియాంక అరుల్. అంత గొప్ప అందగత్తె కాకపోయినా నటిగా వందకు వంద మార్కులు వేయించుకున్న ఈ ప్రతిభావని ఇటీవల ఓ క్రేజీ ప్రాజెక్టులో ఏకంగా అనుపమ పరమేశ్వరన్ నే రీప్లేస్ చేసేస్తోందని ప్రచారమైంది.

కార్తికేయ 2లో నిఖిల్ సరసన అనుపమ స్థానంలో గ్యాంగ్ లీడర్ బ్యూటీ నటిస్తుందంటూ ఇటీవల కథనాలు వేడెక్కించాయి. అయితే ఇది నిజమా? అంటే మేకర్స్ నుంచి ఆన్సర్ వచ్చింది. అనుపమ ఈ చిత్రంలో ఒక భాగం కావాలనుకున్నా.. కాల్షీట్ల సమస్య తలెత్తింది. అందుకే తను బయటకు వెళ్ళవలసి వచ్చింది అని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రాజెక్ట్ ఐదారు నెలల సందిగ్ధం ఇబ్బందికరంగా మారింది.

పురాతన దేవాలయాలు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చందు మొండేటి కార్తికేయ 2 కి దర్శకత్వం వహించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here