జగన్ తో మా సెడ్డ చిక్కొచ్చిపడింది
జగన్ తో మా సెడ్డ చిక్కొచ్చిపడింది

ఏం చేయాల్రా బాబూ…జనంలోకి చూస్తే డబ్బులు కుమ్మేస్తున్నాడు. హిందూత్వ, దళిత,. రెడ్డి ఇలా ఎన్ని కార్డులు వాడినా ఫలితం కనిపించడం లేదు. పొలాలకు బోర్లు ఫ్రీ అంటున్నాడు. మరి మోటార్లు ఇవ్వరా అని అంటే అవి కూడా ఇచ్చేస్తా అంటున్నాడు. చిన్న వ్యాపారులకు తలో పదివేలు సాయం అంటున్నాడు.

కొత్తగా వచ్చే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, అలాగే ప్రతి ప్రసిద్థ ఏజెన్సీకి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. చెప్పడం కాదు నిధులు కూడా విడుదల చేసేసాడు. ఇవన్నీ చాలవన్నట్లు, ప్రతి స్కూలుకు ఫేస్ లిఫ్ట్ ఇచ్చేస్తున్నాడు. సూళ్లు చూస్తుంటే ముచ్చటేసేలా తయారుచేస్తున్నాడు.

ఇలాంటి వాడిని ఏం చేయాలి? జనం ముందు దోషిగా ఎలా నిలబెట్టాలి? ఇదే అహరహం తెలుగుదేశం అనుకూల మీడియా బాధ. అందుకే రెండు అంచెల వ్యూహం ట్రయ్ చేస్తున్నారు.  ఒకటి. ఈ పథకాలు అన్నీ కొత్తవి కావు. తెలుగుదేశం అమలు చేసినవే. వాటినే అటుఇటు మార్చి, అంతకన్నా తక్కువే చేస్తున్నాడు కానీ ఎక్కువ కాదన్నది ఓ ప్రచారం.  కానీ అదీ జనాలు నమ్మడం లేదు. అందుకే ప్లాన్ బి. కూడా. 

జగన్ అప్పులు చేసేస్తున్నాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు. డబ్బులు ఊరికే పంచేస్తున్నాడు అంటూ ఇంకో ప్రచారం. ఇదీ చిత్రంగా వుంది. మీరు ఇచ్చిన పథకాలే మీకన్నా తక్కువే ఇస్తున్నాడు అంటున్నారు. మరోపక్క డబ్బులు ఊరికనే పంచేస్తున్నాడు అంటారు. ఉచిత కరెంట్ తీసేస్తాడు అని మీరే అంటారు. బోర్లు, మోటార్లు ఇచ్చేస్తున్నాడనీ మీరే అంటారు.

సరే, పోనీ మీ ప్రచారానికి జనం మొగ్గుతారా? ఎందుకంటే చంద్రబాబు పసుపు కుంకుమ కోసం కోట్లు అప్పు చేసి తెచ్చారు. పంచారు. అప్పుడు జనం అడిగారా? ఎక్కడ అప్పు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? అని. వాళ్లకు అనువసరం. వాళ్లకు కావాల్సింది ప్రభుత్వం వాళ్లకు ఏమన్నా ఇస్తోందా? లేదా? అన్నదే. పైగా అప్పు చేయకుండా చంద్రబాబు అయిదేళ్లు పాలించాడా? అని అడుగుతారు. 

ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక,దొరికిన ప్రతి సాకును పట్టుకుని యాగీచేద్దాం అనుకుంటున్నారు. కానీ అది ఫలిచడం లేదు. దీంతో జనవరి వస్తోంది అంటే భయంగా వుంది ప్రతిపక్షాలకు.

జనవరిలో మరో విడత అమ్మఒడి ఇచ్చి, రైతు భరోసా అమలు చేసేస్తే, ఇక జగన్ మీద నమ్మకం ఏర్పడిపోతుంది. ఇక చంద్రబాబుకు మరో మార్గం లేదు. తన మేనిఫెస్టో లో కూడా ఈ స్కీములు అన్నీ మరింత మొత్తం యాడ్ చేసి పెట్టడం తప్ప. 

అప్పుడు కూడా జనం నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ ఇస్తున్నవాడిని వదిలేసి, చంద్రబాబును అంత సులువుగా నమ్ముకోలేరు కదా. ఏమైనా జగన్ తో మా సెడ్డ చిక్కు వచ్చి పడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here