ట్రైలర్ టాక్ : ఆసక్తి కలిగిస్తున్న 'జయం' రవి - అరవింద్ స్వామిల 'బోగన్'
ట్రైలర్ టాక్ : ఆసక్తి కలిగిస్తున్న 'జయం' రవి - అరవింద్ స్వామిల 'బోగన్'

కోలీవుడ్ స్టార్ హీరో ‘జయం’ రవి – హన్సిక మొత్వానీ జంటగా నటించిన చిత్రం ‘బోగన్’. సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషించాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. ‘జయం’ రవి – అరవింద్ స్వామి కాంబినేషన్ తో వచ్చిన ‘తని ఒరువన్’ తెలుగులో ‘ధ్రువ’ గా రీమేక్ అయి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బోగన్’ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘బోగన్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు చిత్ర బృందం విడుదల చేసింది.

‘బోగన్’ ట్రైలర్ టెర్రిఫిక్ యాక్షన్ సీన్స్ తో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో ఊహకు అందని ట్విస్టులు చాలా ఉన్నాయని ఈ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. డిఫెరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమా మొత్తం ట్విస్టులతో నడవనుందని తెలుస్తోంది. ఇది ఒక బ్యాంక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తూ ఆదిత్య అనే నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే విక్రమ్ అనే పోలీసాఫీసర్ కథ. అయితే ట్రైలర్ లో ‘విక్రమ్’ ఎవరో ‘ఆదిత్య’ ఎవరో అనే కన్ఫ్యూషన్ ని ఆడియన్స్ కి క్రియేట్ చేస్తూ ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది. జయం రవిని చూసి హన్సిక భయపడటం.. కొన్ని సీన్స్ లో అరవింద్ స్వామి హీరోగా.. కొన్ని సన్నివేశాల్లో విలన్ గా చూపించడం సినిమా ట్విస్ట్ లోని భాగమే అని తెలుస్తోంది.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ‘బోగన్’ ఒక హాలీవుడ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలిగిస్తోంది. దీనికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ.. డి. ఇమ్మాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కలిసి ఈ మూవీని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తయారుచేశాయని తెలుస్తోంది. ఇక విక్రమ్ ఐపీఎస్ గా జయం రవి.. ఆదిత్యగా అరవింద్ స్వామి కలిసి డిఫెరెంట్ మేనరిజమ్స్ తో సిల్వర్ స్క్రీన్ పై మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారని అర్థం అవుతోంది. ఈ చిత్రంలో నాజర్ – పొన్ వణ్ణన్ – నరేన్ – నాగేంద్రప్రసాద్ – వరుణ్ – అక్షర గౌడ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘బోగన్’ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here