పాయల్-అనురాగ్ రేప్ కేసు.. మధ్యలో ఎన్టీఆర్
పాయల్-అనురాగ్ రేప్ కేసు.. మధ్యలో ఎన్టీఆర్

దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేయడానికి ప్రయత్నించాడంటూ ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్.. ఇప్పటికే అతడ్ని పోలీస్ స్టేషన్ వరకు లాక్కొచ్చింది. ఇప్పుడీ వివాదంలోకి ఎన్టీఆర్ ను కూడా లాగింది పాయల్. గతంలో తను పోస్ట్ చేసి డిలీట్ చేసిన ట్వీట్ ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.

అనురాగ్ తనను రేప్ చేయడానికి ప్రయత్నిస్తూ.. ఎన్టీఆర్ పేరును కూడా వాడినట్టు జులైలో ట్వీట్ చేసింది పాయల్. అయితే ఆ వెంటనే దాన్ని ఆమె ట్వీట్ చేసింది. తను మౌనంగా ఉన్న రోజుల్లోనే తనపై జరిగిన కాస్టింగ్ కౌచ్ ఘటనను బయటపెట్టడానికి ప్రయత్నించానంటూ ఆ ట్వీట్ ను ఉదాహరణగా చూపించింది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను మరోసారి వెనకేసుకొచ్చింది పాయల్. అనురాగ్ ఆరోపించినట్టు ఎన్టీఆర్ అలాంటివాడు కాదని, అతడు పక్కా జెంటిల్ మేన్ అంటూ సర్టిఫికేట్ ఇచ్చింది. మహిళల్ని ఎలా గౌరవించాలో తారక్ కు బాగా తెలుసని చెప్పుకొచ్చింది.

మరోవైపు పాయల్ ఆరోపణల మేరకు ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు.. ఈరోజు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను విచారించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వెర్సోవా పోలీస్ స్టేషన్ కు తన లాయర్ ప్రియాంకతో కలిసి వెళ్లిన అనురాగ్.. తనపై వచ్చిన రేప్ ఆరోపణలపై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here