రోజాకి ఆ పదవి ఇప్పుడు దక్కదా?
రోజాకి ఆ పదవి ఇప్పుడు దక్కదా?

ఎక్కడ ఉన్నా ఫైర్ బ్రాండ్ గా ఎమ్మెల్యే రోజా పిలవడుతోంది.. గతంలో టీడీపీలో కూడా ఇదే రీతిలో నిప్పులు చెరిగేది. వైఎస్ఆర్ ను కూడా వదలకుండా తిట్టి పోసేది. అదే సమయంలో జగన్ ను కూడా తిట్టిన దాఖలాలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయిన తరువాత వైఎస్ఆర్ ను కలిసి నాటకీయంగా మద్దతు తెలిపింది. అప్పుడే అనుకున్నారు రోజా టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తుందని.. అన్నట్టే ఆమె చేరిపోయారు.

ఆ తరువాత వైఎస్ఆర్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఈ క్రమంలోనే రోజా కూడా జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మొదటి సారి వైసీపీ తరుఫున ఎమ్మెల్యేగా రోజా గెలిచారు.  అయితే పార్టీ అధికారంలోకి రాలేదు. అయినా అసెంబ్లీలో చంద్రబాబును లోకేష్ ను తన మాటల తూటాలతో ఆడుకుంది. రోజా దెబ్బకు చంద్రబాబు తట్టుకోలేక అసెంబ్లీ నుంచి ఆమెను ఆ 5 ఏళ్ల పీరియడ్ కు శాశ్వతంగా సస్పెండ్ చేశాడు. రోజా కోర్టుకు వెళ్లి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్న తరువాత కూడా స్పీకర్ గా ఉన్న కోడెల శివ ప్రసాద్ ససేమిరా అంటూ రోజాను అసెంబ్లీలోకి రానీయకుండా చేశారు.
 
 రాష్ట్రంలో జగన్ తరువాత అంతే స్థాయిలో పంచ్ డైలాగులు పేల్చే ఎమ్మెల్యేగా రోజాకు ప్రజల్లో బాగా క్రేజ్ ఉంది.  అయితే 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తరువాత రోజాకు మంత్రి పదవి ఇస్తారని అందరూ ఊహించారు. జగన్ ఎందుకో ఇవ్వలేదు. అప్పుడు సోషల్ మీడియాలో రోజాకు అనుకూలంగా రోజాకు పాజిటివ్ గా పోస్టింగ్ లు వెల్లువెత్తాయి. దీంతో వైసీపీ అధిష్టానం పిలిచి మరీ రోజాకు ఏపీఐఐసీ పదవిని ఇచ్చింది.  
    
అయితే రోజా మాత్రం మంత్రి పదవి కావాలని కోరుకుంటోంది. కానీ ఆ పదవి వచ్చే సూచనలు లేవు. ఎందుకంటే ఆమె రెడ్డి సామాజికవర్గంకు చెందిన వారు. కాబట్టి ఇంకొక రెడ్డిని తీసివేసి మంత్రి పదవి ఇవ్వాలి.  కానీ రోజా ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం జగన్ కు బాగా దగ్గర. పైగా పెద్ది రెడ్డి సీనియర్ కాబట్టి ఆయనను తీసి వేసే పరిస్థితి లేదు అని సమాచారం. కాబట్టి ఒక జిల్లాలో ఇద్దరు రెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదు.మహిళా కోటాలో ఇద్దాం అంటే ఆమె రెడ్డి అందుకే.. రోజాను పక్కన పెట్టేశారు.

కనుచూపు మేరలో రోజాకు మంత్రి అయ్యే చాన్స్ లేదు అని ఆమె అభిమానులు బాధ పడుతున్నారు. రోజాను మంత్రిగా చూడాలనుకునే సోషల్ మీడియా అభిమానులకు ఈ సమీకరణాలు ఆశానిపాతంలా మారాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here