IPL 2020: మరో వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
IPL 2020: మరో వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

చెన్నై జట్టు మరో వివాదంలో ఇరుక్కుకుంది . ఆ టీం పేసర్ కేఎం ఆసిఫ్‌ బయోబుడగ రూల్స్ ఉల్లఘించినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సమయంలో తన గది తాళాలను పోగొట్టుకున్న ఆసిఫ్‌ తను మరొ తాళం కావాలంటూ హోటల్‌ రిసెప్షన్‌ దగ్గరకు వెళ్ళీ ఆడిగాడు. ఆ సమయంలో అతను బయో బుడగను దాటాల్సి వచ్చింది. కోవిడ్ నేపథ్యంలో ఐపీఎల్ ఆటగాళ్ళను బయో బుడగలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ నిబంధనను ఆసిఫ్ అతిక్రమించడాని.. దీంతో అతన్ని వారం రోజలు పాటు తిరిగి క్వరెంటైన్ తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ ఖండించారు. అతను రూల్స్ బ్రేక్ చేయాలేదని తెలిపారు. ఆసిఫ్‌ బయో బుడగను వదిలివెళ్లాడన్నది అవాస్తవమన్నారు. ఆసిఫ్ తాళంచెవిని పోగొట్టుకున్నది నిజమే కానీ అతను తాళం హోటల్ రిసెఫ్షన్ దగ్గరకు వెళ్ళలేదని స్పష్టం చేశారు.
జట్టు కోసమే ప్రత్యేకంగా కేటాయించిన సిబ్బందినే తాళంచెవి కోసం ఆసిఫ్‌ అడిగాడని వెల్లడించారు. అతను ఇతరులెవరినీ కలవలేదని, బయో బుడగను నిబంధనకు కట్టుబడి ఉండలన్న విషయం ప్రతి ఆటగాడికీ తెలుసన్నారు. అది ఎంత ముఖ్యమో వారికి తెలుసన్నారు. ఏది ఏమైనప్పటికి ఈ విషయం మరింత స్పష్టత రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here