ఒకసారి కరోనా సోకి నయమైతే.. ఇక మళ్లీ వైరస్ అంటుకోదని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు వైద్యులు కూడా అదే విషయాన్ని చెప్పారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కరోనా రెండోసారి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇటీవల జరిగిన ఓ అధ్యయన ఫలితాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా వచ్చాయి. కరోనా వచ్చిన నయమైన రోగులకు 90 రోజుల తర్వాత మళ్లీ రావొచ్చని కొత్త అధ్యయనం తేల్చిచెబుతోంది. వైరస్ సోకి తగ్గిన వారు మూడునెలల తర్వాత ఎంతో అప్రమత్తంగా ఉండాలని.. వారు ఏ మాత్రం అజాగ్రత్త వహించినా వైరస్ తిరగదోడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇటీవల చాలా మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. 15 నుంచి 20 రోజుల్లో కోలుకొని బయట తిరుగుతున్నారు. అయితే అటువంటి వారు శరీరంలో కొంత వైరస్ ఉంటుందని వారు కరోనా వాహకాలుగా మారుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. యాంటీ బాడీస్ వైరస్ను చంపేస్తాయి. వైరస్ ఊపిరితిత్తులు నాడి మండలం రక్త సరఫరా వ్యవస్థలను దెబ్బతీయక ముందే రోగనీరోధకశక్తి ఉన్నవాళ్లు బయటపడుతున్నారు.

కానీ రోగ నిరోధక శక్తి లేని వాళ్లను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.
ఒక సారి కరోనా పరీక్షలు నిర్వహించాక అతడికి మందులిచ్చి వైద్యసిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. కేవలం ఏదైనా సీరియస్ అయితేనే వాళ్లను పట్టించుకుంటున్నారు. ఇది ఎంతో ప్రమాదం అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 28 రోజుల తర్వాత కూడా వ్యక్తి శరీరంలో వైరస్ ఉండొచ్చని.. లక్షణాలు లేకపోయిన సదరు వ్యక్తులు ఇతరులకు వైరస్ అంటిస్తారని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here