నేడు మహాత్మా గాంధీ 151వ జయంతి. ఈ సందర్భంగా యావత్ భారతం గాంధీ మహాత్ముడు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటోంది. అహింసే ఆయుధంగా స్వాతంత్ర్య పోరాటం చేసి.. బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి దేశాని విముక్తి కల్పించిన జాతిపితకు ఘనంగా నివాళి అర్పిస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ నేత ఆజాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాళి అర్పించారు. పుష్పాలతో అంజలి ఘటించి.. నమస్కరించారు.

గాంధీజీ నుంచి అందరం ఎంతో నేర్చుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన సిద్ధాంతాలు ఇలాగే మనందరినీ ముందుకు నడిపిస్తూ..దేశానికి శుభం కలిగించాలని ఆయన ఆకాంక్షించారు. గాంధీ జయంతి వేళ దేశాభివృద్ధి, సంక్షేమం కోసం మనకు మనం పునరంకింతం చేసుకుందామని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. సత్యం, అహింసా మంత్రాలను తాను విశ్వసిస్తానని..గాంధీ కలగన్న భారత్ కోసం అందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here