జాతీయ సగటును మించిన యాక్టివ్ కేసులు.. కేరళలో అక్టోబరు 31 వరకు 144 సెక్షన్
జాతీయ సగటును మించిన యాక్టివ్ కేసులు.. కేరళలో అక్టోబరు 31 వరకు 144 సెక్షన్

కేరళలో కరోనా వైరస్ మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కచోట ఐదుగురు మించి గుమిగూడటాన్ని నిషేధిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 144ను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా గురువారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మంది గుమిగూడటం వల్ల కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఆదేశాలు అక్టోబరు 3 శనివారం ఉదయం 9 గంటల నుంచి అమల్లోకి వస్తాయనీ.. ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here