డ్రైవర్ పై రివర్స్ కంప్లైంట్ పెట్టిన హాట్ బ్యూటీ
డ్రైవర్ పై రివర్స్ కంప్లైంట్ పెట్టిన హాట్ బ్యూటీ

రెండు రోజుల క్రితం క్యాబ్ డ్రైవర్ రాజు తనను సినిమా నటి ముమైత్ ఖాన్ మోసం చేసిందని తన క్యాబ్ ను గోవాకు బుక్ చేసుకున్న ఆమె అక్కడకు వెళ్లిన తర్వాత పది రోజులు ఉంచేసుకుంది. ఆ సమయంలో తనకు ఉండేందుకు సరైన ప్లేస్ చూపించలేదు. అలాగే అమౌంట్ విషయంలో కూడా ఆమె నన్ను మోసం చేసింది. పెట్రోలు.. టోల్ గేట్ ఇలా అన్ని కలిపి రూ.15 వేలు అయితే ఆమె నా మొత్తంను ఇవ్వకుండా తప్పించుకుంది అంటూ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ లో ఆమెపై ఫిర్యాదు చేసి ఆ తర్వాత పోలీసులను ఆశ్రయిస్తాను అంటూ ఆయన చెప్పాడు. దాంతో మీడియాలో ముమైత్ ఖాన్ గురించి రచ్చ రచ్చ ప్రచారం మొదలైంది.
రాజు మీడియాతో మాట్లాడుతూ కారులో సిగరెట్లు తాగుతూ తనకు చాలా ఇబ్బంది కలిగించిందని గోవా వెళ్లి వచ్చే వరకు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లుగా ఆయన చెప్పాడు. తనపై రాజు చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ముమైత్ ఖాన్  అతడిపై రివర్స్ కేసు పెట్టేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ రాజుపై రాత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది. అతడు తన పరువు తీసేలా మాట్లాడాడు. నేను అతడికి 23500 రూపాయలు చెల్లించాను. అయినా కూడా అతడు అమౌంట్ ఇవ్వలేదని మీడియా ముందు చెబుతున్నాడు. అతడి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. నేను ఇండస్ట్రీలో 12 ఏళ్లకు పైగా ఉంటున్నాను. నేను ఏంటీ అనేది అందరికి తెలుసు. నేను అతడి ఫ్యామిలీ గురించి ఆలోచించి పట్టించుకోకుండా ఉంటే మరింతగా రెచ్చి పోయి మాట్లాడాడు. అందుకే ఫిర్యాదు చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here