చెవి నుంచి రక్తం కారితే.. అంత ప్రమాదమా? కారణలేమిటీ?
చెవి నుంచి రక్తం కారితే.. అంత ప్రమాదమా? కారణలేమిటీ?

చెవి నుంచి రక్తం కారుతుందా? దీన్ని చిన్న విషయంగా భావించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే.. చెవి నుంచి రక్తం కారడం ప్రమాదానికి సంకేతం. అయితే, చెవి నుంచి రక్తం కారడానికి ముఖ్యంగా మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి.

1. చెవి లోపలి మార్గంలో ఉండే చర్మం పగిలినప్పుడు ఒక్కోసారి రక్తస్రావం జరుగుతుంది. ఆ సమయంలో చాలా తక్కువ రక్తం కారుతుంది. పైగా అది ఎక్కువ సేపు ఉండదు. ఇలాంటి పరిస్థితి వస్తే.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యుని సంప్రదించి చికిత్స పొందవచ్చు.

2. పెద్ద పెద్ద పేలుళ్లు, లౌడ్‌స్పీకర్ల శబ్దాలు, విమానయానం, స్విమ్మింగ్ పూల్‌లో ఎత్తుల నుంచి డైవింగ్ చేస్తున్నప్పుడు కర్ణభేరిపై ఒత్తిడి ఏర్పడి పగిలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు కూడా చెవి నుంచి రక్తం వస్తుంది.
3. తలకు బలమైన దెబ్బ తగిలినా, తల ఎముకలు విరిగినా చెవుల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుంది. దీని వల్ల స్పృహ తప్పే అవకాశం ఉంది. ఇది పైన పేర్కొన్న సమస్యల కంటే అంత్యత ప్రమాదకరమైనది. వెంటనే చికిత్స అందించకపోతే ప్రాణాలు పోవచ్చు.

చెవిలో రక్తస్రావానికి కారణమయ్యే మరికొన్ని సమస్యలు ఇవే:
✺ చెవిలో ఎక్కడైనా చిన్న కురుపు లేదా పుండు ఏర్పడితే నొప్పి వస్తుంది. ఆ కురుపు పగిలినప్పుడు చెవి నుంచి రక్తం బయటకు రావచ్చు.
✺ చెవి లోపలి మార్గాన్ని కప్పి ఉంచే చర్మంపై ఎగ్జిమా ఏర్పడినట్లయితే రక్తస్రావం కలుగుతుంది.
✺ కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా కర్ణభేరి పగిలి రక్తం వచ్చే అవకాశం ఉంది.
✺ చెవిలో పదునైన వస్తువులను పెట్టుకున్నా కర్ణభేరికి రంథ్రం కావచ్చు.
✺ పురుగులు చెవిలోకి దూరి హాని కలిగించవచ్చు.
✺ క్యాన్సర్ వల్ల కూడా చెవి నుంచి రక్తస్రావం జరుగుతుంది.

ఈ జాగ్రత్తలు పాటించండి:
✺ పెద్ద పెద్ద శబ్దాలు వినొద్దు.
✺ చెవిలో పెన్సిల్, పెన్, తాళం చెవులు వంటి పదునైన వస్తువులు పెటొద్దు.
✺ చెవి లోపల పండ్లు ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
✺ చెవిలో ఏది పడితే అది పోయకూడదు. ఏదైనా వైద్యుల సూచనతోనే చేయాలి.
✺ చెవిలో నీరు వెళ్లకుండా జాగ్రత్తపడండి.
✺ విమానాల్లో ప్రయాణించేప్పుడు చెవిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. కాబట్టి. చెవిలో బడ్స్ లేదా దూది పెట్టుకోండి.
✺ చెవిలో రంధ్రం ఏర్పడినప్పుడు ఎలాంటి ద్రవాలను పోయరాదు.
✺ స్విమ్మింగ్ చేసేప్పుడు, ఎత్తుల నుంచి దూకేప్పుడు చెవులను కాపాడుకోవాలి.
✺ చెవి భాగం చెంప దెబ్బలు, మరే రకమైన దెబ్బలు తగిలినా చనిపోయే ప్రమాదం ఉంది.
✺ చిన్న చిన్న పురుగులు చెవిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి.
✺ చెవులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

✺ స్నానం చేసిన తర్వాత చెవిలో నీరు లేకుండా చూసుకోవాలి.

✺ చిన్న పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
✺ చెవిలో గులం తీయడానికి ఇయర్ బడ్స్ వంటి సున్నితమైన వస్తువులనే వాడాలి. లేదా వైద్యులను సంప్రదించాలి.

గమనిక: మన శరీరంలోని సున్నితమైన భాగాల్లో చెవి కూడా ఒకటి.. కాబట్టి దానికి ఏ సమస్య వచ్చినా ఇంటి వైద్యం వద్దు. డాక్టర్‌ను సంప్రదించి సమస్యను చెప్పి ఔషదాలను తీసుకోవడమే ఉత్తమం. పైన పేర్కొన్న విషయాలు కేవలం మీ అవగాహన కోసం అందించామని గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here