అక్టోబర్ 6న రానున్న పోకో సీ3.. బడ్జెట్ ధరలోనే రానున్న కొత్త పోకో ఫోన్!
అక్టోబర్ 6న రానున్న పోకో సీ3.. బడ్జెట్ ధరలోనే రానున్న కొత్త పోకో ఫోన్!

పోకో సీ3 స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ ప్రకటించలేదు. ఈ సంవత్సరం జూన్‌లో మలేషియాలో లాంచ్ చేసిన రెడ్ మీ 9సీకి తర్వాత వెర్షన్‌గా ఈ ఫోన్ రానున్నట్లు కంపెనీ పేర్కొంది. పోకో సీ3 మనదేశంలో అధికారికంగా లాంచ్ కావడానికి ఇంకా ఒక వారమే ఉంది.

పోకో ఇండియా ట్వీట్ ప్రకారం ఈ ఫోన్ అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. దీన్ని ప్రత్యక్షప్రసారం చేస్తుందో లేదో కంపెనీ తెలపలేదు. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ధర, సేల్ తేదీ కూడా అధికారికంగా తెలియరాలేదు. కానీ దీని రిటైల్ బాక్స్ ఫొటో ఆన్ లైన్లో లీకైంది. దీని ప్రకారం దీని 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,990గా ఉండనుంది.స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. రెడ్ మీ 9సీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఒకవేళ అదే నిజమైతే అందులో ఉండే స్పెసిఫికేషన్లే ఇందులో కూడా ఉండనున్నాయి.
ఇందులో కూడా 6.53 అంగుళాల హెచ్ డీ+ ఎల్సీడీ డాట్ డ్రాప్ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ను అందించారు. స్టోరేజ్ ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కెమెరా కాగా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. పోకో సీ3లో ఎంఐయూఐ 12ను అందించే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని రెడ్ మీ 9సీ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బరువు 194 గ్రాములుగా ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, మైక్రో యూఎస్ బీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో కూడా అందించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఇందులో అందించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here