రెడ్ మీ 9 ప్రైమ్ సేల్ నేడు.. ధర రూ.10 వేలలోపే!
రెడ్ మీ 9 ప్రైమ్ సేల్ నేడు.. ధర రూ.10 వేలలోపే!

షియోమీ తన రెడ్ మీ 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ల సేల్‌ను ఈరోజు(అక్టోబర్ 2వ తేదీ) నిర్వహించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు అందించారు.

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గానూ, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,999గానూ నిర్ణయించారు. స్పేస్ బ్లాక్, మింట్ గ్రీన్, మాటే బ్లాక్, సన్ రైజ్ ఫ్లేర్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.ఈ స్మార్ట్ ఫోన్ లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లే అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని ర్యామ్ సామర్థ్యం 4 జీబీగా ఉంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్ ను అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లే అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని ర్యామ్ సామర్థ్యం 4 జీబీగా ఉంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్ ను అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగా పిక్సెల్ డెప్త్ షూటర్ లు కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5020 ఎంఏహెచ్ గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనక భాగంలో ఉంది. ఈ ఫోన్ మందం 0.91 సెంటీమీటర్లుగానూ, బరువు 198 గ్రాములుగానూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here