Smuggling gold in N95 Mask: మాస్కులో బంగారం.. ఈ దొంగ మాములోడు కాదు
Smuggling gold in N95 Mask: మాస్కులో బంగారం.. ఈ దొంగ మాములోడు కాదు

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా మూతపడిన విషయం తెలసిందే. ఇప్పుడిప్పుడే ప్రయాణాలు మళ్లీ మొదలయ్యాయి. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా.. ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి రావడంతో వస్తువులు, బంగారం, ఆభరణాలు దొంగతనం చేసే వారు ఇట్టే దొరికిపోతున్నారు. దీన్నుంచి తప్పించుకోవడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడో దొంగ. కరోనా నుంచి కాపాడుకోవడానికి పెట్టుకునే మాస్కులోనే బంగారాన్ని ఉంచాడు. కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

గతనెల 28న కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం లో కేరళ నుంచి దుబాయ్ వెళ్లడానికి విమానం రెడీగా ఉంది. అది బయలుదేరడానికి ముందు నిబంధనల ప్రకారం.. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా పోలీసులను షాక్ గురిచేసే దృశ్యం కనిపించింది. ఒక ప్రయాణికుడు తన నోటికి పెట్టుకున్న ఎన్-95 మాస్క్ లో.. రూ. 2 లక్షల విలువ చేసే బంగారాన్ని దాచాడు. అంతే.. అవాక్కవడం పోలీసుల వంతైంది.

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విమానాశ్రయంలో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి చేశారు. దీనిని ఆసరాగా చేసుకున్న ఆ దొంగ ఏకంగా మాస్క్ లోనే 40 గ్రాముల బంగారాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. దీనిని గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ దొంగది కర్ణాటకలోని బత్కల అనే ఊరు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.కేరళలో సాధారణంగా కాలికట్, తిరువనంతపురం విమానాశ్రయం, నౌకాశ్రయాల గుండా బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియా లోని జెడ్డా నుంచి వస్తున్న ఒక వ్యక్తి కూడా రూ. 30 లక్షల విలువ చేసే బంగారాన్ని తీసుకొస్తూ.. పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here