'సుశాంత్ జూన్ 13 అర్థరాత్రి రియాను డ్రాప్ చేశాడు..దీనికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు'
'సుశాంత్ జూన్ 13 అర్థరాత్రి రియాను డ్రాప్ చేశాడు..దీనికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు'

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. అదే క్రమంలో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే జూన్ 8న సుశాంత్ ఆదేశాల మేరకు రియా అతని ఫ్లాట్ నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సుశాంత్ సూసైడ్ కేసుని సీబీఐ దర్యాప్తు చేసే క్రమంలో డ్రగ్స్ కోణం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియాను అరెస్ట్ చేసి విచారిస్తోంది.
అయితే ఇటీవల సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని పరిశీలించిన ఎయిమ్స్ బృందం అతనిది ఆత్మహత్యగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ముంబై కార్యదర్శి అడ్వకేట్ వివేకానంద్ గుప్తా రిపబ్లిక్ టీవీతో మాట్లాడుతూ సుశాంత్ మరణించాడనికి ముందు రోజు జూన్ 13న అర్థరాత్రి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రియా చక్రవర్తిని తన ఇంటి వద్ద డ్రాప్ చేసాడని.. దానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారని పేర్కొన్నాడు.

“జూన్ 13 మరియు 14 మధ్య రాత్రి సుశాంత్ సింగ్ రియా చక్రవర్తిని తన ఫ్లాట్ వరకు 1 – 1.30 గంటలకు డ్రాప్ చేయడాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. రియాను తన ఫ్లాట్ లో వదిలిన తరువాత సుశాంత్ తిరిగి తన ఇంటికి వెళ్ళాడు”అని వివేకానంద్ గుప్తా చెప్పారు. సుశాంత్ మరణంపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ ముందు ప్రత్యక్ష సాక్షి అన్ని విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇంతకముందు కర్ణి సేన నాయకుడు సుర్జీత్ సింగ్ రాథోడ్ కూడా సుశాంత్ సింగ్ చనిపోయే ముందు రోజు రాత్రి రియా చక్రవర్తి అతని నివాసంలో ఉన్నారని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here