బంతికి శానిటైజర్ రాసిన బౌలర్.. 9 మ్యాచ్‌ల నిషేధం వేటు!
బంతికి శానిటైజర్ రాసిన బౌలర్.. 9 మ్యాచ్‌ల నిషేధం వేటు!

శానిటైజర్ రాసి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన సస్సెక్స్ ఫాస్ట్ బౌలర్ మిచ్ క్లేడన్‌పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 9 మ్యాచ్‌ల నిషేధం విధించింది. బాబ్ విల్లీస్ ట్రోఫీలో భాగంగా.. ఆగస్టు 23న మిడిలెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లేడన్ శానిటైజర్‌ను బంతికి రాశాడని సస్సెక్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కానీ ఈ విషయమై మరిన్ని వివరాలను వెల్లడించలేదు.

ఆస్ట్రేలియాలో జన్మించిన క్లేడన్.. ఈసీబీ నిబంధనలు 3.3, 3.7లను ఉల్లంఘించాడు. ఇప్పటికే సస్సెక్స్ అతడిపై 6 మ్యాచ్‌లపాటు సస్పెన్షన్ విధించింది. దీంతో క్లేడన్ మరో 3 మ్యాచ్‌లు ఆడకపోతే సరిపోతుంది.ఈ నిషేధం కారణంగా అతడు క్వార్టర్ ఫైనల్ కూడా దూరం అవుతాడు. 2021 సీజన్లో సస్సెక్స్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు సైతం క్లేడన్ దూరం అవుతాడు. ఈసీబీ 3.3 నిబంధన ప్రకారం.. క్రికెట్ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఏ క్రికెటర్ వ్యవహరించకూడదు.

బాబ్ విల్లీస్ ట్రోఫీలో 4 మ్యాచ్‌లు ఆడిన క్లేడన్.. 26.72 యావరేజ్‌తో 11 వికెట్లు తీశాడు. సస్పెన్షన్ ముగిసిన తర్వాత కూడా క్లేడన్ మరోసారి తప్పిదాలకు పాల్పడకూడదు. క్లేడన్‌పై సస్సెక్స్ వెంటనే చర్యలు తీసుకున్నప్పటికీ.. క్రమశిక్షణ సంఘం ఆ జట్టుపై కూడా చర్యలు తీసుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here