WhatsApp Tricks | వాట్సప్ స్టేటస్… వాట్సప్ నుంచి వచ్చిన అద్భుతమైన ఫీచర్. రోజూ ఈ ఫీచర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు వాట్సప్ యూజర్లు. మరి వాట్సప్ స్టేటస్‌లో ఈ ట్రిక్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
1. మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? వాట్సప్‌లో మెసేజెస్ పంపిస్తున్నారా? ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారా? వాట్సప్‌లో తరచూ స్టేటస్ అప్డేట్ చేస్తుంటారా? అయితే మీరు ఈ ట్రిక్ తెలుసుకోవాల్సిందే. వాట్సప్ ఒకప్పుడు మెసేజింగ్ యాప్‌గా పరిచయం. కానీ ఆ తర్వాత అనేక ఫీచర్స్ వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం
2. ఫోటోలు షేర్ చేయడం, వీడియోలు షేర్ చేయడం, ఆ తర్వాత డాక్యుమెంట్స్ పంపడం… ఇలా అనేక కొత్త ఫీచర్స్‌ని యూజర్స్‌కి పరిచయం చేసింది వాట్సప్. అయితే వాట్సప్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ట్రిక్స్ కూడా ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మీ వాట్సప్ యాప్‌ను మీరు మరింత సమర్థవంతంగా వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అందులో ఒకటి మీ వాట్సప్ స్టేటస్‌ని మీరు ఏ కాంటాక్ట్కైనా పంపడం. ఉదాహరణకు మీరు వాట్సప్ స్టేటస్‌లో పెట్టిన ఫోటో లేదా వీడియో అవతలివారికి నచ్చినప్పుడు వాటిని పంపమని కోరుతుంటారు. మరి ఆ ఫైల్ ఎక్కడుందో మీ ఫోన్లో వెతికి పంపడం ఓ పద్ధతి. ఇది కొంచెం టైమ్ తీసుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇలా కాకుండా సింపుల్‌గా వాట్సప్ స్టేటస్ నుంచే ఆ ఫైల్ని మీరు కోరుకున్న వ్యక్తులకు సులువుగా పంపొచ్చు. ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి. అందులో స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత My Status పక్కన ఉండే త్రీ డాట్స్ క్లిక్ చేయండి. మీరు గత 24 గంటల్లో అప్డేట్ చేసిన స్టేటస్లు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అందులో మీరు పంపాలనుకున్న స్టేటస్ పక్కన ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేయండి. అందులో Forward ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ వాట్సప్ ఛాట్స్ కనిపిస్తాయి. అందులో మీరు ఎవరికి మీ స్టేటస్ పంపాలనుకుంటే వాళ్ల ఛాట్ సెలెక్ట్ చేసి సెండ్ చేయండి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ ట్రిక్ ఉపయోగించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ స్టేటస్ ఫీచర్లో మరో ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఉంది. మీ స్టేటస్ ఎవరు చూడాలో మీరే నిర్ణయించొచ్చు. ఇందుకోసం ముందు మీ వాట్సప్ ఓపెన్ చేసి స్టేటస్ పైన క్లిక్ చేయండి. పైన కుడివైపు త్రీడాట్స్ క్లిక్ చేయండి. Status Privacy ఆప్షన్ సెలెక్ట్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. అందులో My contacts, My contacts except, Only share with అని మూడు ఆప్షన్స్ ఉంటాయి. My contacts సెలెక్ట్ చేస్తే మీ స్టేటస్ అప్డేట్స్ని మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్లందరూ చూడొచ్చు. My contacts except సెలెక్ట్ చేస్తే అందులో మీ స్టేటస్‌ని ఎవరు చూడొద్దని మీరు అనుకుంటున్నారో వాళ్ల పేర్లు సెలెక్ట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం
8. ఇక Only share with సెలెక్ట్ చేస్తే మీరు సెలెక్ట్ చేసినవాళ్లు మాత్రమే మీ స్టేటస్ అప్డేట్స్ని చూసే అవకాశం ఉంటుంది. మిగతావారికి స్టేటస్ కనిపించదు. ఇలా మీ వాట్సప్ స్టేటస్ ఎవరు చూడాలో మీరే డిసైడ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. అయితే ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు ఇప్పటికే అప్డేట్ చేసిన స్టేటస్‌కు వర్తించవు. అంటే మీరు అప్పటికే ఓ స్టేటస్ అప్డేట్ చేసి ఆ తర్వాత సెట్టింగ్స్ మారిస్తే లాభం లేదు. అందుకే ముందే సెట్టింగ్స్ మార్చి స్టేటస్ అప్డేట్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)