ధోనీకి ఏమైంది..? చివర్లో అంతగా ఇబ్బంది పడ్డాడెందుకు..?
ధోనీకి ఏమైంది..? చివర్లో అంతగా ఇబ్బంది పడ్డాడెందుకు..?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కంగ్స్ ఏడు పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. సన్‌రైజర్స్ కేవలం ఒక్క మ్యాచ్ అనుభవం ఉన్న అబ్దుల్ సమద్‌ చేతికి బంతిని ఇచ్చింది. ధోనీ క్రీజ్‌లో ఉండటంతో చెన్నై విజయం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. తొలి బంతి పడకుండానే వైడ్, ఎక్స్‌ట్రాల రూపంలో 5 పరుగులు రావడంతో ఆరు బంతుల్లో 23 పరుగులు చేస్తే చాలు చెన్నైదే విజయం. కానీ ఆ ఓవర్లో చెన్నై 20 రన్స్ మాత్రమే చేసింది.

చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయడానికి ధోనీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 36 బంతుల్లో 47 రన్స్ చేసినప్పటికీ.. ధోనీ తన జట్టును గెలిపించలేకపోయాడు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ధోనీ.. దాదాపు 40 ఏళ్ల వయసులో.. యూఏఈలోని అధిక వేడిమికి తట్టుకోలేకపోయాడు. గొంతు పొడి బారడంతో దగ్గు మొదలవడంతో మహీ సతమతం అయ్యాడు. వేడిమితో ఇబ్బంది పడిన ధోనీ.. పదే పదే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. చివరి 8 బంతుల్లో చెన్నై విజయానికి 35 రన్స్ అవసరమైన దశలో ఫిజియో వచ్చి ధోనీని పరీక్షించి వెళ్లాడు.

బంతిని బ్యాట్‌తో సరిగా కనెక్ట్ చేయడంలోనూ ధోనీ విఫలమయ్యాడు. ఎంతగా శ్రమించినా.. వికెట్ స్లోగా ఉండటంతో… బ్యాటింగ్ చేయడం కష్టమైంది. దీంతో ధోనీ నాటౌట్‌గా నిలిచినా… ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండోసారి ఓడింది. ధోనీ నాటౌట్‌గా ఉన్నప్పటికీ.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడటం ఓవరాల్‌గా ఇది ఆరోసారి మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here