యాంటీ వైరల్ టీ షర్ట్, లోషన్.. ఇక వైరస్ మీ దరిచేరదు..
యాంటీ వైరల్ టీ షర్ట్, లోషన్.. ఇక వైరస్ మీ దరిచేరదు..

కరోనా.. కరోనా.. కరోనా… ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయం. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినా.. నోటికి మాస్క్, జేబులో శానిటైజర్ తప్పనిసరి. పని చేసుకొని ఇంటికి తిరిగొచ్చామో అంతే.. ఆ బట్టలు తీసి.. సర్ఫ్ నీటిలో నానబెట్టి.. వెంటనే స్నానం కూడా చేస్తుంటారు. అయితే ఇదీ పెద్ద పనీ.. అవసరం ఉన్నా ప్రతిసారీ ఇలా చేయడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిని గమనించిన ఐఐటీ ఢిల్లీ స్టార్టప్ సరికొత్త ఆవిష్కరణ చేపట్టింది. యాంటీ వైరల్ టీ షర్ట్, రక్షణ ఇచ్చే లోషన్ తయారు చేసింది. దీని ధర కూడా తక్కువలో ఉంటుందని ప్రతినిధులు చెబుతున్నారు.
ఢిల్లీ ఐఐటీకి చెందిన ఇ టెక్స్, కెన్ స్టా స్టార్టప్‌లు కలిసి చక్కని పరిష్కారం కనుగొన్నాయి. యాంటి వైరల్ టీ షర్ట్ రూపొందించాయి. ఇదీ ధరిస్తే వైరస్ దరిచేరదు. దీంతోపాటు ఇ టెక్స్ మాస్క్ కూడా తయారు చేసింది. ఇటు కెన్ స్టా లోషన్, శానిటైజర్ రూపొందించింది. ఈ నాలుగింటితో కలిసి కిట్ ఏర్పాటు చేశారు. శుక్రవారం కిట్‌ను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రామ్ గోపాల్ రావు ఆవిష్కరించారు. వీరికి ఐఐటీ ఢిల్లీ రసాయన శాస్త్ర, జౌళి విభాగాలకు చెందిన నిపుణులు సహకరించారు.

30 సార్లు ఉతికిన ప్రభావం కోల్పోదు..

యాంటి వైరల్ టీ షర్ట్ 30 సార్లు ఉతికిన కూడా ప్రభావం కోల్పోదని నిపుణులు తెలిపారు. ఇక లోషన్‌లోని యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు 24 గంటల వరకు కరోనా వైరస్ నుంచి రక్షిస్తాయని తెలిపారు. దీంతో శానిటైజర్ వినియోగం తగ్గించొచ్చు అని ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. అంతేకాదు లోషన్ చేతులు, కాళ్లు, మొహానికి కూడా రాసుకోవచ్చని తెలిపారు. శానిటైజర్ కూడా మంచి ప్రభావం చూపిస్తోందని తెలిపారు. ఆల్కహాల్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని తెలిపారు.

అందుబాటు ధరలో టీ షర్ట్,

లోషన్‌తో వైరస్‌ను జయించొచ్చు అని నిపుణులు తెలిపారు. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుందని వివరించారు. వ్యాక్సిన్ వచ్చేలోపు టీ షర్ట్, లోషన్‌తో వైరస్‌ బరి నుంచి తప్పించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here