ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా నేరుగా పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మామ కడసారి చూసి భావోద్వేగం చెందారు. మధ్యాహ్నం జరగనున్న మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి తదితరులు నివాళర్పించారు.
కాగా, సీఎం జగన్ సతీమణి వైఎస్ జగన్ భారతి తండ్రి అయిన ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి గంగిరెడ్డి కన్నుమూశారు.