ప్రముఖ ఓటీటీ కంపెనీతో స్టార్ డైరెక్టర్ వివాదం!
ప్రముఖ ఓటీటీ కంపెనీతో స్టార్ డైరెక్టర్ వివాదం!

స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ భారీ పాన్ ఇండియా ప్లానింగ్స్ గురించి తెలిసినదే. రానా హీరోగా మైథలాజికల్ డ్రామా `హిరణ్య కశ్యప` చిత్రానికి వర్క్ చేస్తున్నారు. వీఎఫ్.ఎక్స్ సహా యానిమేషన్ వింగ్ తో కలిసి ఆయన ప్రాజెక్టుపై డీటెయిలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ గత నాలుగేళ్లుగా అమెరికాలో జరగుతోంది. త్వరలోనే షూటింగ్ ని స్టార్ట్ చేస్తామని హాలీవుడ్ చిత్రాల తరహాలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని చేస్తున్నామని ఇటీవల డి. సురేష్ బాబు మీడియాకు వివరించారు.

ఇదిలా వుండగానే.. గుణశేఖర్ కు ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ కి మధ్య వివాదం తలెత్తిందని ప్రచారం జరుగుతోంది. `హిరణ్యకశ్యిప` సెట్స్ పైకి రావడానికి మరింత సమయం పడుతుంది కాబట్టి గుణశేఖర్ ఆ సమయంలో నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయాలనుకున్నారని ప్రచారమైంది. ఇందు కోసం వారితో ఒప్పందం కూడా చేసుకున్నారట. అయితే ఆయన పంపించిన స్క్నిస్ట్ నెట్ ఫ్లిక్స్ కి నచ్చలేదని అందుకే ఆయనని తిరస్కరించారని ప్రచారం మొదలైంది.

దీనిపై తాజాగా గుణశేఖర్ స్పందించారు. తను నెట్ ఫ్లిక్స్ తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని అసలు తనకు వెబ్ సిరీస్ లు చేయాలన్న ఆలోచనే లేదని.. రూమర్లని నమ్మొద్దని స్పష్టం చేశారు. అంతే కాదు తన నుంచి త్వరలోనే ఓ హాట్ అప్ డేట్ రాబోతోందని వెల్లడించారు. గుణశేఖర్ చెబుతానంటున్న సంగతేమిటి? అంటే.. ` హిరణ్య కశ్యప` గురించేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పై పరుగులు పెట్టిస్తారన్నదే ఆ గుసగుస సారాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here