జర్నలిస్ట్‌లకు ఆరోగ్య భద్రత --రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారి లక్ష్యం.
జర్నలిస్ట్‌లకు ఆరోగ్య భద్రత --రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారి లక్ష్యం.

ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు ప్రత్యేక శ్రద్ధతో శరవేగంగా కదిలిన
వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ ఫైల్.

రాష్ట్రంలో జర్నలిస్ట్‌లకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య రక్షణకు వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం ఫైల్ పై సంతకం చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు…

వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం రెన్యూవల్ 31.3.2021వరకు చేస్తూ నేడు వెలవడునున్న ఉత్తర్వులు.

రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం పేరుతో ఆరోగ్య పధకం అమలులో ఉంది…

ఈ పధకం 31.3.2020తోగడువు ముగిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్‌లకు ఆరోగ్య సేవలు నిలిచిన విషయం APUWJ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారి ద్రుష్టికి తీసుకొని వచ్చింది…

కరోనా సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు బిజీగా ఉండడం వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ
జర్నలిస్ట్‌ల పక్షపాతి ఉన్న మంత్రి ఆళ్ల నాని గారు సత్వరమే స్పందించి వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం రెన్యూవల్ కు ఆమోద ముద్ర వేశారు..

రాష్ట్ర వ్యాప్తంగా 8, 456మంది అక్క్రిడిటేషన్ జర్నలిస్ట్‌ల కు ప్రయోజనం చేకూరనుంది…

కరోనా కారణంగా జర్నలిస్ట్‌ల వాటా ప్రీమియం చెల్లించే అవసరం లేకుండా వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం రెన్యూవల్ చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులకు ఆదేశాలు ఇచ్చారు..

రాష్ట్ర వ్యాప్తంగా 26, 656మంది జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం ఉపయోగ పడుతుంది…

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు నిర్ణయంతో 31.3.2021వరకు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు…

వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం రెన్యూవల్ కు నేడు ఉత్తర్వులు వెలువడనున్నాయి..

జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరంగా ఎంతో మీకు చేసే వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం కు ఆమోద ముద్ర వేచి మరో సారి జర్నలిస్ట్ ల పక్షపాతిగా నిలిచిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి APUWJ ధన్యవాదములు… కృతజ్ఞతలు తెలిపింది…

రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్‌లు అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి రెడ్డి గారు సంకల్పం అని మంత్రి ఆళ్ల నాని గారు పేర్కొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here