అల్లు అర్జున్‌ని చూడటం కోసం 200 కి.మీ కాలినడక.. డైహార్డ్ ఫ్యాన్‌ని సర్ ప్రైజ్ చేసిన బన్నీ
అల్లు అర్జున్‌ని చూడటం కోసం 200 కి.మీ కాలినడక.. డైహార్డ్ ఫ్యాన్‌ని సర్ ప్రైజ్ చేసిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే పడిచచ్చే అభిమానులు చాలా మందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ ఇతర రాష్ట్రాల్లో కూడా బన్నీకి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించిన బన్నీ.. మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే డైహార్డ్ ఫ్యాన్‌కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు.

తెలుగు వాళ్ల అభిమానం చూరగొనాలే కాని.. అభిమానించడం మొదలు పెడితే ప్రాణం పెట్టేస్తారు అనడానికి ఇదో ఉదాహరణ. బన్నీ అంటే పడిచచ్చిపోయే మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే యువకుడు ఎలాగైనా తన అభిమాన హీరోని కలవాలని మాచర్ల నుంచి కాలినడకన హైదరాబాద్ వచ్చేశాడు. సుమారు 200 కిలోమీటర్లు బన్నీని చూడటం కోసం నడిచే వచ్చాడు ఆ వీరాభిమాని. అల్లు అర్జున్ ఇంటి అడ్రస్‌ని కనుక్కుని ఆయన్ని కలవాలని ప్రయత్నించి చివరికి విజయం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here