కొత్తగా ఏదైనా వ్యాక్సిన్ లేదా మెడిసిన్ కనిపెట్టే ముందు వాటిని ఎలుకలు లేదా కోతులపై ప్రయోగిస్తారనే సంగతి మనకు తెలిసిందే. అయితే, ఓ శాస్త్రవేత్త ఏకంగా తనపైనే ప్రయోగాలు చేసుకుంటున్నాడు. వేలాది దోమలతో కుట్టించుకుని.. అవి తనకు ఎలాంటి రోగాలు కలిగిస్తాయో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ప్రపంచంలో ప్రమాదాలు, కరోనా వైరస్ తర్వాత అత్యధిక మరణాలు దోమల వల్లే సంభవిస్తున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. పలు వైరస్‌లకు వాహకాలుగా పనిచేస్తున్న దోమలు ఏటా సుమారు ఒక మిలియన్ ప్రజలను చంపేస్తున్నాయట. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, యెల్లో ఫీవర్, జైకా వైరస్, ఎన్సెఫాలిటిస్, జపనీస్ యెల్లో ఫీవర్ వంటి వ్యాధులు దోమలు వల్లే ఏర్పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో దోమల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు కోరుతున్నారు. దోమలను నుంచి ప్రజలను రక్షించేందుకు కొన్ని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కీటక శాస్త్రవేత్త (ఏంటోమోలోజిస్ట్) పెరాన్ రాస్ ఏకంగా తన మీదే ప్రయోగాలు చేసుకుంటూ తన ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.

Our study on inbreeding and laboratory adaptation in mosquitoes is out now! https://t.co/AnE8KU5aJR pic.twitter.com/ckUadL6ChD
— Perran Ross (@MosWhisperer) November 28, 2018