జర్నలిస్టులపై దాడులు చేయడం దురదృష్టకరం. మేం అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పత్రికలో ఇష్టారాజ్యంగా రాతలు రాశారు. కానీ మేం ఏనాడు సాక్షి రిపోర్టర్లతో అమర్యాదగా వ్యవహరించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా తిరగబడింది. అధికార పార్టీ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై భౌతికదాడులకు దిగడం దారుణం. ఈ రోజు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అంజాద్ ఖాన్ పై వైసీపీ నాయకుల అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. జిల్లా ఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించడం ద్వారా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాను.