మోనాల్ కోసం కొట్టుకునేందుకు సిద్ధమైన అఖిల్, అభి.. గుండెలు అవిసేలా రోదిస్తూ ఆమె
మోనాల్ కోసం కొట్టుకునేందుకు సిద్ధమైన అఖిల్, అభి.. గుండెలు అవిసేలా రోదిస్తూ ఆమె

మొత్తానికి బిగ్ బాస్ వ్యూహం ఫలించింది.. ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసేందుకు లవ్ ట్రాక్‌ని పెట్టడం.. ఇద్దరు వ్యక్తులు తిట్టుకుని కొట్టుకునేట్టుచేయడం కామన్ చూస్తూ ఉంటాం. అయితే ఈ సీజన్‌లో బిగ్ బాస్ అనుకున్నదానికి పది రెట్లు ఎక్కువ ఔట్ పుట్ ఇచ్చేందుకు పాపం ఆ గుజరాతీ ఇంగ్లీష్ పాప మొనాల్ దొరిగింది. దీంతో అఖిల్, అభిజిత్, మొనాల్‌ల మధ్య రొమాంటిక్ ట్రై యాంగిల్ లవ్ ట్రాక్ పెట్టేశారు బిగ్ బాస్.

 

స్వయానా నాగార్జునే రంగలోకి దిగి.. ఆమె మనసులో A ఉందని చెప్పడం .. దానికి మొనాల్ తెగ సిగ్గు పడిపోవడం.. హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులు.. దివి, స్వాతి దీక్షిత్, లాస్యలు అలాగే బయటకు వచ్చిన కరాటే కళ్యాణి, స్వాతి, దేవిలు కూడా వీరి మధ్య ఎఫైర్‌పై క్లారిటీ ఇవ్వడంతో మోనాల్ అటు అభి.. ఇటు అభిజిత్‌లో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ జనంలోకి బలంగా వెళ్లిపోయింది.

సోమవారం వచ్చేసింది కాబట్టి.. ఐదోవారం నామినేషన్ హీట్ ఉండనే ఉంటుంది. దీనిలో భాగంగా అందరూ ఊహించనట్టే అఖిల్-అభిజిత్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టుగా పరిస్థితి తయారైంది.

తాజా ప్రోమోలో ఆ మోనాల్ కోసం ఇద్దరూ తిట్టుకుంటూ దూషించుకుంటున్నారు. అందరూ ఊహించనట్టే అఖిల్‌ని నామినేసిన అభిజిత్.. ‘నువ్ కన్ఫ్యూజ్ అవుతావని తెలుసు.. కాని పచ్చి అబద్ధం ఆడతావని ఇప్పుడే తెలుసుకున్నాను.. కళ్లు పెద్దగా చేసి వేలెత్తి చూపిస్తూ మాట్లాడితే ఎదుటివాడు భయపడడు’ అంటూ అఖిల్ ముఖానికి నురుగ పూసాడు అభిజిత్. నువ్ వేలెత్తి చూపించకు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు అఖిల్. ‘నేను నీకు ప్రతిసారి ఇదే చెప్తున్నా’ అంటూ అభి అంతే సీరియస్‌గా రియాక్ట్ అవ్వగా.. ‘ఆరోజు కూడా మోనాల్‌కి ఫింగర్ చూపించి మాట్లాడావు.. ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడితే బయటకు వేరే విధంగా వెళ్తుంది.. ‘ఆమె విషయం నీకెందుకు బ్రదర్.. నేను ఆ అమ్మాయితో మాట్లాడుకుంటా మీకెందుకు’? అంటూ అభి కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరూ కంట్రోల్ తప్పి కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు.

దీంతో తనకోసమే తన్ను చచ్చేలా ఉన్నారని మోనాల్ బోరు బోరున ఏడ్చింది.. నా పేరు తీసుకురావద్దు అంటూ గట్టిగా అరుస్తూ గుండెలు అవిసేలా రోదిస్తోంది. మొత్తానికి ఈ ముగ్గురు మధ్యనా ఎఫైర్ నడుస్తుందని బిగ్ బాస్, నాగార్జునతో బాగానే ప్రచారం కల్పించారు కానీ.. ఒక అమ్మాయి జీవితంపై పెద్ద మచ్చ పడిందనే విషయాన్ని మాత్రం పట్టించుకోకపోవడం విచారకరం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here