ఆట వస్తువు గొంతులో ఇరుక్కొని ఏడాదిన్నర చిన్నారి మరణించింది. ఈ ఘటన జిల్లాలోని గరుగుబిల్లి మండలం చినగుడబలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ వీధికి చెందిన సంధ్యారాణి తన ఏడాదిన్నర కుమార్తె మౌనికకు కుర్కురే ప్యాకెట్ ఇచ్చింది. కుర్కురే తింటూ చిన్నారి అందులోని ఆట బొమ్మను మింగేసింది. పాప స్పృహతప్పి పడిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించింది. వైద్యులు పోస్టుమార్టం చేసి గొంతులో ఇరుక్కున్న ఆట వస్తువును బయటకు తీశారు. ఘటనపై పాప తల్లిదండ్రులు గురుగుబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.