ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు

– రాష్ట్రంలో హింసాత్మక దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలపై తెదేపా అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు.

– వరుస దుర్ఘటనలతో పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని పోగొట్టాయని వ్యాఖ్యానించారు.

– పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.*

రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడటంతో పాటు శాంతిభద్రతలు పరిరక్షించాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. డీజీపీకి లేఖ రాశారు. పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న చంద్రబాబు.. ప్రశ్నించే వారి ఆస్తుల ధ్వంసమే వైకాపా ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు.రాష్ట్రంలో హింసాత్మక దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆయన.. వరుస దుర్ఘటనలే పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని పోగొట్టాయని వ్యాఖ్యానించారు.
ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం ఏపీ పోలీసులపై అత్యధిక కేసుల నమోదే.. దీనికి ఉదాహరణ అని చంద్రబాబు తెలిపారు. దేశవ్యాప్తంగా పోలీసులపై 4,068 కేసులు నమోదైతే.. అందులో 41 శాతం ఏపీలోనే ఉన్నాయన్నారు.
రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని.. డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు సూచించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here