రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం
రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం

రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వాహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతిభవన్ లో పోలీసు ఉన్నతాధికారుల విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి తదితర మాదక దృవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. హోం, అటవీ శాఖ మంత్రులు, కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డి.జి.పి, అడిషనల్ డి.జి.పిలు, ఐ.జీలు, డి.ఐ.జీలు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here