ముచ్చటైన జంటకు ముడెట్టి మూడేళ్లు అయ్యింది
ముచ్చటైన జంటకు ముడెట్టి మూడేళ్లు అయ్యింది

అవును.. ఇది నిజం. ముచ్చటైన జంటకు ముడెట్టి మూడేళ్లు అయ్యింది. ఈ మూడేళ్లలో ప్రేమైక జీవనంలో ఆదర్శ జంటగా వెలిగిపోతూ నిరంతరం యూత్ కి గోల్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి గురించో చెప్పాలా? సమంత అక్కినేని – అక్కినేని నాగ చైతన్య జంట గురించే…

నేడు ఈ జంట మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన హబ్బీ చైతూకు శుభాకాంక్షలు తెలిపింది. ఇన్ స్టాలో ఒక అందమైన ఫోటోని షేర్ చేసిన సామ్ ఎమోషనల్ గా స్పందించారు. “మీరు నా వాడు. నేను మీదానను.. ఏ తలపు వచ్చినా.. మేం దానిని కలిసి తెరుస్తాము. వార్షికోత్సవ శుభాకాంక్షలు భర్త గారు..“ అంటూ పోయెటిక్ గానే స్పందించారు సామ్. `ఏ మాయ చేసావే` సమయంలో మొదలైన ప్రేమానుబంధం చివరికి పెళ్లితో జత కలిసింది.

ఎనిమిదేళ్లకు ఇండ్లలో అందరినీ ఒప్పించి పెళ్లాడుకున్నారు. మిస్టర్ అండ్ మిసెస్ అక్కినేని 6 అక్టోబర్  2017 న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. హిందూ – క్రైస్తవ విధానాల్లో పెళ్లి జరిగింది. ఈ జంట తమ మూడేళ్ల వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో అక్కినేని అభిమానులు సామ్ మరియు చై నుండి ఒక బిడ్డను ఆశిస్తున్నారు. అయితే సామ్ ఇటీవల తనకు పుట్టబోయే బిడ్డ గురించిన ప్రణాళిక కు సంబంధించి పుకార్లను ఖండించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here