Instagram‌కు పదేళ్లు, దాని పుట్టుపూర్వోత్తరాలు, ప్రయాణం సాగిందిలా
Instagram‌కు పదేళ్లు, దాని పుట్టుపూర్వోత్తరాలు, ప్రయాణం సాగిందిలా Instagram‌కు పదేళ్లు, దాని పుట్టుపూర్వోత్తరాలు, ప్రయాణం సాగిందిలా

Instagram Turns 10: సామాజిక మాధ్య‌మాల్లో ఫొటో షేరింగ్ యాప్‌గా ఇన్‌స్టా గ్రామ్‌కు మంచి పేరు ఉంది. దశాబ్దం క్రితం ఇది ప్రారంభ‌మైంది. అప్ప‌ట్లో సాధారణ ప్రజలకు అంతగా తెలియని ఇన్‌స్టాగ్రామ్.. ఇప్పుడు కొన్ని కోట్ల‌మంది ప్రజల రోజువారీ జీవితాల్లోకి ప్రవేశించింది. మన అల‌వాట్ల‌ను ప్ర‌భావితం చేసే స్థాయికి చేరుకుంది.

2010 అక్టోబర్ 6న కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్ అనే ఇద్దరు అమెరికన్లు ఫోటో షేరింగ్ కోసం ప్ర‌త్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రారంభించారు. ఫోటోను ఫిల్ట‌ర్ చేయ‌డానికి కొన్ని ఫీచ‌ర్ల‌ను అందించారు. ఇది ఎంతోమందిని ఆక‌ట్టుకుంది. ప్రారంభించిన రెండు సంవత్సరాల తరువాత దీన్ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. 21 మిలియన్ల మంది అనుచరులతో ఫ్యాషన్ బ్లాగర్ చియారా ఫెర్రాగ్ని, 196 మిలియన్ల మంది అనుచరులతో కైలీ జెన్నర్ వంటి ఇన్‌స్టాగర్ల్స్ స్టార్లుగా మారారు. ప్రారంభించినప్ప‌టి నుంచి ఇన్‌స్టాగ్రామ్ సెల్ఫీలకు వేదిక‌గా మారింది. క్ర‌మంగా అంత‌కు మించి అభివృద్ధి చెందింది. ప్రజల లైఫ్ స్టైల్పై కూడా ఇది ప్రభావం చూపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here