ఆదోనిలో రైల్వే ట్రాక్ పక్కన ఎర్రబ్యాగ్, తీసి చూస్తే ఆనందమే ఆనందం
ఆదోనిలో రైల్వే ట్రాక్ పక్కన ఎర్రబ్యాగ్, తీసి చూస్తే ఆనందమే ఆనందం

కర్నూలు జిల్లా అదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో ఉన్న రైల్వే పట్టాలు ప్రక్కన ఉన్న పొదలలో 20 లక్షల రుపాయలు దొరికాయి. సోమవారం గణేకల్ రైల్వే ట్రాక్ పై విధులు నిర్వహిస్తున్న రైల్వే ఉద్యోగులు రమన్త భోర, వినోద్ దేవాసి లకు నగదు దొరికింది. వీరిద్దరు రైల్వే పట్టాలపై విధులు నిర్వహిస్తున్నారు. ఇంతలో ట్రాక్ ప్రక్కన పొదలలో ఎర్రటి బ్యాగు కనిపించింది. అందులో ఏమి ఉందోనని అనుమానంతో బ్యాగ్ తెరిచి చూశారు. అందులో రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. దీంతో సిబ్బంది అవాక్కయ్యారు. ఉన్నట్టు ఉండి డబ్బులు ఉన్న బ్యాగు దొరకడంతో ఏమి చేయాలో అర్థం కాక కొంత సేపు డైలామలో పడ్డారు. చివరికి అదోని తాలుకా పోలీసు స్టేషన్ కు వెళ్లి దొరికిన డబ్బును ఎస్ఐ కు అప్పగించి నిజాయితీ ని నిరూపించుకున్నారు. దొరికిన రూ.20 లక్షలను నిజాయితీగా పోలీసులకు స్వాధీన పరిచిన రైల్వే సిబ్బంది రమన్త భోర, వినోద్ దేవాసి లను ఎస్ఐ అభినందించారు. ఈ డబ్బు పొగుట్టుకున్న వారు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో వచ్చి డబ్బును తీసుకెళ్లవచ్చు అన్నారు.

రైలు పట్టాల పక్కన పొదల్లో డబ్బు దొరికింది. అది ఎవరిదో తెలీదు. చిన్న ఉద్యోగం చేసుకునే వారిద్దరూ డబ్బులను తీసుకుని పంచుకోవచ్చు. సహజంగా చాలా మంది ఇలాగే ఆలోచించడానికి ఆస్కారం ఉంది. ఎవరూ చూడలేదు కాబట్టి చక్కగా చెరో రూ.10 లక్షలు తీసుకుంటే సరిపోతుందని ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ వారు అలా చేయలేదు. తమ డబ్బు కానిది తమకు అవసరం లేదని భావించారు. అలాగే, దీని వెనుక ఏమైనా మతలబు ఉందేమోననే భయం కూడా వారిని వెంటాడి ఉండొచ్చు. అందుకే వారిద్దరూ డబ్బులను పోలీసులకు అప్పగించారు. ఆ రైల్వే ఉద్యోగులు తమ నిజాయితీతో అందరి మనసులు గెలుచుకున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆ డబ్బు తమదే అని ఎవరూ ముందుకు రాలేదు. పూర్తి ఆధారాలతో వస్తే డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని పోలీసులు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here