నిన్న హాస్పిటల్ నుంచి బయటకు.. నేడు మాస్కు తీసేసిన ట్రంప్
నిన్న హాస్పిటల్ నుంచి బయటకు.. నేడు మాస్కు తీసేసిన ట్రంప్

కీలక స్థానాల్లో ఉండే వారంతా ఎంతో బాధ్యతగా ఉంటారు. అందునా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వారు మరింత జాగ్రత్తగా ఉంటారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సంచలనాల మీద సంచలనాలకు తెర తీస్తున్నరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కరోనా పాజిటివ్ గా తేలటంతో వాల్టర్ రీడ్ మెడికల్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు.

ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉందంటూ వార్తలు రావటంతో చాలామంది ఆందోళన చెందారు. ఈ వార్తలకు భిన్నంగా ఆయన ఆసుపత్రి నుంచి బయటకు కారులో వచ్చి.. తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులు.. పార్టీ కార్యకర్తలకు అభివాదం తెలిపిన వైనం షాకింగ్ గా మారింది. ట్రంప్ చర్యను ఆయన వైద్యం తీసుకుంటున్న ఆసుపత్రి వైద్యులు సైతం తప్పు పట్టారు.

ఇది సరిపోదన్నట్లుగా తాజాగా ఆయన వ్యవహరించిన తీరు మరోసారి విమర్శలకు తెర తీసేలా చేశారు. ఈ రోజు ఆసుపత్రి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో వైట్ హౌస్ కు చేరుకున్నారు. కొద్ది రోజులు వైట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పి.. ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. అయితే.. వైట్ హౌస్ కు చేరుకున్న ట్రంప్.. ఫోటోలకు ఫోజులిచ్చిన వైనం షాకింగ్ గా మారింది.  ఎందుకంటే.. ఫోటోలు తీసుకునే వేళ.. ముఖానికి ఉన్న మాస్కును తొలగించిన వైనాన్ని తప్పు పడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ మాన్షన్ లో అభివాదం చేస్తూ.. తాను బాగున్నట్లుగా చేతి వేళ్లను చూపిస్తూ.. మాస్కు తీయటాన్ని తప్పు పడుతున్నారు. ఇలా ఆయన చేస్తున్న పనులకు ట్రంప్  కంటే కూడా.. ఆయన చుట్టూ ఉండే వారికి భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here