'దేశా'నికి ఆ ధైర్యం వుందా?
'దేశా'నికి ఆ ధైర్యం వుందా?

గ్రామాలకు పరిపాలనను చేరువ చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అందరూ సంతోషించే విధంగా వాలంటీర్ల వ్యవస్థను వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా చప్పట్లు కొట్టి అభినందించే పని చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్ సంకల్పం.

దీన్ని సహజంగానే వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ. అత్యాచారాలు, దౌర్జన్యాల వ్యవస్థ ఇది. వైకాపా కార్యక్తరల వ్యవస్థ ఇది అంటూ విమర్శలు కురిపించింది.

సరే, అధికారపక్షం చేసిన దానిని ప్రతిపక్షం ఎప్పడూ మెచ్చుకోదు. ఏ  పార్టీ అయినా ఇదే తంతు. కానీ ఒక్కటే అనుమానం, పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత విమర్శించినా తెలుగుదేశం పార్టీ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించగలదా?.

ఈ వ్యవస్థ పనికారాదు, ఈ వాలంటీర్లు పనికిరారు, ఈ సెక్రటరీలు అవసరం లేదు అని బాహాటంగా ప్రకటించి, తాము అధికారంలోకి వస్తే ఇదంతా రద్దు చేస్తామని ప్రకటించే ధైర్యం వుందా?

తెలుగుదేశం ఆ పని చేస్తే, ఓ చారిత్రాత్మిక తప్పిదం చేసినట్లే అవుతుంది. గ్రామాల్లో ఇవ్వాళ ఓ డిఫరెంట్ వాతావరణం కనిపిస్తోంది. దాదాప ప్రతి పెద్ద పల్లెలోనూ ఓ గవర్మమెంట్ ఆఫీసు. దానికి నిత్యం కొంతమంది ఉద్యోగులు రావడం, ఎమ్మార్వో, ఎండీవో ఆఫీసు చుట్టూ తిరిగితే తప్ప కానీ చాలా పనులు అక్కడే జరిగిపోవడం కనిపిస్తోంది. ఫింఛన్ల పంపిణీ సంగతి సరేసరి.

మరి ఇలా అన్ని విధాలుగా ప్రజలకు చేరువైన వ్యవస్థను తెలుగుదేశం పార్టీ విమర్శలతో సరిపెడుతుందా? రద్దు చేసే ధైర్యం చేస్తుందా? లేదా తాము వచ్చాక, ఇప్పుడు వున్న వాలంటీర్లను తీసేసి, తెలుగుదేశం కార్యకర్తలకు ఆ అవకాశం ఇస్తుందా? .

ఇలా ఏం చేయాలని ఆలోచన చేసినా అది తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యాసదృశంగా మారుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here