#బిగ్ బాస్ 4.. సారీలు సరే.. ఆ ఏడుపులు అరిచేయడాలేంటమ్మా!
#బిగ్ బాస్ 4.. సారీలు సరే.. ఆ ఏడుపులు అరిచేయడాలేంటమ్మా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సన్నివేశం ఎలా ఉంది?  రక్తి కడుతోందా.. సోసోయేనా? అంటే ఇప్పటివరకూ మిశ్రమ స్పందనలే వ్యక్తమవుతున్నాయి. ఇక  ఇల్లు అంతా గ్లామర్ డాళ్స్ తో అధిక వోల్టేజ్ ని పంప్ చేస్తున్నా ఇంకా విసిగించే లోటుపాట్లు అలానే ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే… హౌస్మేట్స్ కు `బిగ్ బాస్ హోటల్` అనే సరదా జాబ్ ఆకట్టుకుంది. ఈ పనిలో కొంతమంది పోటీదారులు అతిథులుగా ఉన్నారు. మరికొందరు హోటల్ నడిపేవాళ్లు… పని వేళ వేళాకోళాలు.. సరదాలు మామూలే. అభిజీత్ చమత్కారమైన సమాధానాలతో ఆకట్టుకోగా.. ఇతర హౌస్ మేట్స్ తో సరదాగా కలిసిపోతున్నాడు. కుమార్ సాయి అభిజీత్ తో చేరాడు. డ్యూటీలో ఉల్లాసం పెంచే యాక్ట్ తో ఆకట్టుకున్నారు. ఇవేనా.. అవినాష్ కు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ని ఇచ్చారు.

జాబ్ పూర్తి చేసాక అభిజీత్ – అఖిల్ వేర్వేరు సంభాషణలలో మోనాల్ కు క్షమాపణలు చెప్పినప్పుడు ఎపిసోడ్ లో ఉద్వేగం పీక్స్ కి చేరిందనే చెప్పాలి. నామినేషన్ పని సమయంలో మునుపటి ఎపిసోడ్లో అఖిల్ – అభిజీత్ నడుమ వారి వ్యక్తిగత విభేదాలపై కలహించగా.. మోనాల్ ని ఆ ఇద్దరూ వాదనలోకి లాగారు. హౌస్ లో ట్యాప్ విప్పాలంటే మోనాల్ తర్వాతే.. భావోద్వేగంతో బరస్ట్ అయిపోతుంది. ఈసారి కూడా అంతే. గుండె పగిలిన మోనాల్  ఆ ఇద్దరిపైనా అరిచేస్తూ.. అనవసరమైన విషయాలలోకి లాగవద్దని వార్నింగ్ ఇచ్చింది మరి. ఆ ఇద్దరూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కూడా ఎపిసోడ్ లో ఆరోపించడం అట్టుడికించింది.

మోనాల్ కు క్షమాపణలు చెప్పాక కూడా అభిజీత్ – అఖిల్ తమ వాదనను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఏదేమైనా.. మోనాల్ అఖిల్ ని కౌగిలించుకున్నాక కానీ మొత్తం సమస్య సమసిపోలేదు మరి. మొత్తానికి దీనిని అందరూ  పాస్ చేసారు.
అఖిల్- నోయెల్- అభిజీత్ – సోహెల్- అమ్మ రాజశేఖర్ — లాస్య- సుజాత – అరియానా .. వీళ్లంతా ఇంటి సభ్యులే. ఎవరి ఆటలో ఆరు మేటి. వారాంతంలో షో హోస్ట్ నాగార్జున అక్కినేని ఇంటి నుండి తొలగించబడే పోటీదారుడి పేరును ప్రకటిస్తారు. ఈసారి ఎవరు ఎలిమినేట్ కానున్నారు? అన్నది ఇంకా సస్పెన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here