ఎంగేజ్మెంట్ ఫోటోలలో చందమామలా మెరిసిపోతున్న కాజల్...!
ఎంగేజ్మెంట్ ఫోటోలలో చందమామలా మెరిసిపోతున్న కాజల్...!

ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30న కాజల్ వివాహం చేసుకోబోతోంది. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అందరి ఆశీస్సులు కావాలని కోరింది. కొన్ని రోజుల్లో వధువుగా మారుతున్న నేపథ్యంలో కాజల్ ఇంట్లో బ్యాచిలరేట్ పార్టీ జరిగింది. కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసింది. నిజానికి ఆ ఫోటోలు సెప్టెంబర్ 28న కాజల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కానీ అవి బ్యాచిలరేట్ పార్టీకి సంబంధించిన ఫొటోలని ఎవరూ గుర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిలో బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ‘బ్రైడ్ టు బి’ క్యాప్షన్ తో కాజల్ ఫొటోలకు ఫోజులిచ్చింది.
కాగా ఇటీవలే కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కాజల్ – గౌతమ్ ల నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు. కాజల్ వివాహం గురించి అధికారిక ప్రకటన రావడంతో ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా ఆమె సన్నిహితులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాజల్ కి కాబోయే ఆడపడుచు గౌతమ్ కిచ్లు సోదరి గౌరి కిచ్లు నాయర్.. కాబోయే వధూవరులతో తాను తీసుకున్న ఫోటో షేర్ చేసింది. దీనికి కాజల్ అగర్వాల్ ‘థాంక్యూ మై అడోరబుల్ సిస్టర్’ అని రిప్లై ఇచ్చింది. ఈ ఫోటో ఎంగేజ్మెంట్ సందర్భంగా తీసుకున్నదని తెలుస్తోంది. ఈ ఫోటోలో కాజల్ చందమామలా మెరిసిపోతోంది. ఇక కాజల్ పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అక్టోబర్ 30న కాజల్ – గౌతమ్ కిచ్లుల వివాహం ముంబైలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరుగనుంది. పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తానని కాజల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here